
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు నేడు చివరి రోజు. శుక్రవారం తొలుత ప్రధాని మోడీ వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బిడెన్‌తో టెక్నాలజీ హ్యాండ్‌షేక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మోదీకి ఎరుపు రంగు టీషర్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. దీని మీద ది ఫ్యూచర్ ఈజ్ AI, అమెరికా,ఇండియా అని వ్రాయబడింది. ప్రధాని మోదీ తన చారిత్రాత్మక US కాంగ్రెస్ ప్రసంగంలో AI - అమెరికా, భారతదేశంలో స్నేహం గురించి, స్థిరమైన అభివృద్ధి గురించి ప్రశంసించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "గత ఏడేళ్లలో చాలా మార్పులు వచ్చాయి, కానీ భారతదేశం , యుఎస్ మధ్య స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలనే నిబద్ధత అలాగే ఉంది. AI [ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్] యుగంలో.. మరొక AI (అమెరికా-ఇండియా) మరిన్ని పరిణామాలను చూసింది" అని అన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విదేశాంగ శాఖ లంచ్‌కు హాజరయ్యారు. ఇందులో అమెరికా విదేశాంగ శాఖ అధికారులందరూ పాల్గొన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. మధ్యాహ్న భోజనంలో సమోసా, కిచ్డీ, మామిడి హల్వా వంటి అనేక వంటకాలు వడ్డించబడ్డాయి. దీని తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బోయింగ్ సీఈవో డేవిడ్ ఎల్. కాల్హౌన్ కలుసుకున్నారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ టెక్నాలజీ హ్యాండ్‌షేక్ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. భారత్, అమెరికా మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని, ఈ బంధాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం ముఖ్యమైనదని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ తన సంక్షిప్త ప్రసంగంలో ప్రతిభ, సాంకేతికత కలిస్తే బంగారు భవిష్యత్తును సృష్టించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్య నాదెళ్ల, ఆనంద్ మహీంద్రా, సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మన్, లిసా సూ, టిమ్ కుక్, ముఖేష్ అంబానీ, విల్ మార్షల్, థామస్ తుల్, నిఖిల్ కామత్, వీరేంద్ర కపూర్, హేమంత్ తనేజా తదితరులు పాల్గొన్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను కూడా ఆహ్వానించారు.
కమలా హారిస్ ప్రసంగంలోని ముఖ్య విషయాలు..
కమలా హారిస్ భారతదేశంలోని తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సమయంలో సౌత్ ఇండియా స్పెషల్ ఇడ్లీ, అలాగే తన సోదరి మాయ మాటలను కూడా పంచుకున్నారు. తన తాత భారతదేశ స్వాతంత్ర్య పోరాటం గురించి, ప్రజాస్వామ్యం గురించి చెప్పేవారనీ, తన తాత నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. తన తల్లి శ్యామల కూడా చాలా నేర్పిందనీ, నేడు ఆమె వల్లే తాను అమెరికా ఉపాధ్యక్షురాలిగా ముందు నిలబడి ఉన్నానని భావోద్వేగానికి లోనయ్యారు. భారతదేశం ప్రపంచానికి చాలా నేర్పించిందనీ, ఆయుధాలు లేని శాసనోల్లంఘన ఉద్యమం భారతదేశం నుండే వచ్చిందనీ, నేడు అదే భారతదేశం శాస్త్ర సాంకేతిక, వైద్య రంగాల్లో ప్రపంచానికి మార్గాన్ని చూపుతోందని ప్రశంసించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఈ శతాబ్దాన్ని ప్రపంచానికి మేలు చేసింది. ప్రపంచాన్ని కరోనా నుంచి రక్షించేందుకు వ్యాక్సిన్‌ని ఇచ్చింది భారతేనని కొనియాడారు.
ఇంతకీ ప్రధాని ఏం చెప్పారు...
మోదీ తన ప్రసంగంలో మాట్లాడుతూ.. స్వాగతించినందుకు ధన్యవాదాలు. మూడు రోజులు సమావేశాల్లో గడిపాను. ఇరుదేశాల మధుర గీతం ముందుకు సాగాలని అందరూ అంగీకరించారు. కమలా హారిస్ తల్లి అమెరికా వచ్చినప్పుడు లేఖల ద్వారానే భారత్ తో సంబంధాలు కొనసాగించారు. దూరం వేల మైళ్లు, కానీ హృదయాలు కనెక్ట్ చేయబడ్డాయి. కమల ప్రపంచంలోని మహిళలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. అలాగే..సెక్రటరీ బ్లింకెన్ మాట్లాడుతూ.. ఆయన గురించి ప్రపంచానికి తెలుసు, కానీ మీరు సంగీతం విషయంలో కూడా చాలా ప్రతిభావంతులని అన్నారు.