ఆర్టికల్ 370 రద్దు.. మా అత్తమామలతో మాట్లాడి 22రోజులౌతోంది.. ఊర్మిళ ఆవేదన

By telugu teamFirst Published Aug 30, 2019, 3:54 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కశ్మీర్ ప్రజలు ఎంతో కాలంగా భద్రతా బలగాల నీడలో నివసించాల్సి వస్తోందని ఆమె అన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా వాళ్లు గడపాలని ప్రశ్నించారు. ఏదైనా సంచలన నిర్ణయం తీసుకునే ముందు ప్రజలు ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచిస్తే బాగుండేదన్నారు. తన భర్త వారి తల్లిదండ్రులతో మాట్లాడి 22 రోజులయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా... కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసించగా... కాంగ్రెస్ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఊర్వసి మాటోండ్కర్ తాజాగా స్పందించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కశ్మీర్ ప్రజలు ఎంతో కాలంగా భద్రతా బలగాల నీడలో నివసించాల్సి వస్తోందని ఆమె అన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా వాళ్లు గడపాలని ప్రశ్నించారు. ఏదైనా సంచలన నిర్ణయం తీసుకునే ముందు ప్రజలు ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచిస్తే బాగుండేదన్నారు. తన భర్త వారి తల్లిదండ్రులతో మాట్లాడి 22 రోజులయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన అత్తమామలిద్దరూ చక్కెర వ్యాధి, హైబీపీతో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. వారికి ఇంట్లో మందులు సైతం అందుబాటులో ఉన్నాయో లేదో కూడా తమకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఊర్మిళ ముంబయి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేశారు. 

click me!