వివాహేతర సంబంధం : ప్రియుడిని చంపించిన భర్త.. విషయం తెలిసి భార్య చేసిన దారుణం...

Published : May 24, 2022, 02:04 PM IST
వివాహేతర సంబంధం : ప్రియుడిని చంపించిన భర్త.. విషయం తెలిసి భార్య చేసిన దారుణం...

సారాంశం

వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్తే చంపించాడని తెలియడంతో ఓ భార్య మనస్తాపానికి గురైంది. దీంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.  

రాజస్థాన్ : extramarital affair కాపురాల్లో చిచ్చు పెట్టడమే కాదు. ఎంతోమంది ప్రాణాలను కూడా బలికొంటున్నాయి. పచ్చని కాపురాలు కూల్చడమే కాదు.. భార్యనో.. భర్తనో నేరస్తులుగా మారుతున్నారు. ఈ క్రమంలో పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఇలాంటి ఘటనే Rajasthanలో జరిగింది. 

తాజాగా రాజస్థాన్ లో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు చనిపోయారు. ఇందులో ఒకరు హత్యకు గురవ్వగా, మరొకరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎలాగంటే... తన ప్రియుడిని భర్తే చంపించాడని తెలియడంతో ఓ మహిళ రైలు కిందపడి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన ఓ 40 యేళ్ల మహిళ తన భర్త మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలిసింది. దీంతో అతను కోపంతో ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె భర్త మాట వినలేదు. తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. 

తాను హెచ్చరించానా వినలేదని తీవ్ర ఆగ్రహం పెంచుకున్న భర్త తన మేనల్లుడిని ఆదివారం చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారమే నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రియుడు చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ సోమవారం మధ్యాహ్నం రైలు కిందపడి చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు తరలించారు. 

ఇదిలా ఉండగా, Chittoor జిల్లా సదుం మండలంలో twin murders శనివారం కలకలం రేపాయి. అమ్మగారిపల్లె పంచాయతీ ఎగువ జాండ్రపేట లోని వాటర్ ప్లాంట్ వద్ద  ద్దరిని ఎవరో murder చేసినట్లు ఉదయం పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఇన్చార్జి సీఐ గంగిరెడ్డి,  చౌడేపల్లి ఎస్ ఐ రవి కుమార్ పరిశీలించారు. హత్యకు గురైనవారు  రాధా, వెంకటరమణ గా గుర్తించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు అంగళ్లుకు చెందిన  రాధ (28)కు పుట్టపర్తి ఎనమలవారి పల్లెకు చెందిన  నరసింహులుతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. 4 నెలల క్రితం భర్తతో మనస్పర్థలు రావడంతో ఆమె తన కూతురు సాయి తేజతో కలిసి విడిగా ఉంటుంది.  

ఈ క్రమంలో తన అన్న వెంకటరమణ(37), స్నేహితుడు రాముతో కలిసి గత నెల జాండ్రపేటలోని ఓ ప్రైవేటు వాటర్ ప్లాంట్ లో కూలిపనులకు చేరి, అక్కడే నివాసం ఉంటుంది. కొద్ది రోజుల క్రితం భర్త నరసింహులు అక్కడికి వచ్చి తనతో వచ్చేయడంతో వివాదం చెలరేగింది. ఇటీవల తిరిగి తాను భర్త వద్దకు వెళ్లిపోతానని రాధా, రాముకు చెప్పడంతో గత కొద్ది రోజులుగా వారి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ క్రమంలోనే అతను వారిద్దరిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాధను బండరాయితో కొట్టి చంపగా, వెంకటరమణ చెవి కింది భాగంలో గాయమైంది. సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సాయితేజ(4)ను విచారిస్తున్నారు.  వీఆర్వో మహబూబ్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పీలేరుకు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?