రైలులో యువతికి నెలసరి.. ప్యాడ్ పంపిన రైల్వే శాఖ

By ramya neerukondaFirst Published Jan 18, 2019, 10:18 AM IST
Highlights

నెలసరి సమస్యతో బాధపడుతున్న ఓ యువతికి.. రైల్వే శాఖ సహాయం చేసి తన ఉదారతను చాటుకుంది.

నెలసరి సమస్యతో బాధపడుతున్న ఓ యువతికి.. రైల్వే శాఖ సహాయం చేసి తన ఉదారతను చాటుకుంది. నిత్యం రైల్వే శాఖ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ.. దాని ద్వారా ప్రజలతో అనుసంధానం అవుతోన్న సంగతి తెలిసిందే. కాగా.. అదే సామాజిక మాద్యమం ద్వారా ఓ యువతి సమస్యను రైల్వే శాఖ తీర్చింది.

నెలసరి సమస్యతో బాధపడుతున్న ఓ యువతికి ట్యాబ్లెట్లు, ప్యాడ్లు అందించి ప్రయాణికుల మన్ననలు అందుకుంది. బెంగళూరు నుంచి బళ్లారికి ప్రయాణిస్తున్న యువతికి రైలులో నెలసరి వచ్చింది. ఆమె తన బాధను మరో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న స్నేహితుడికి చెప్పింది. అతడు వెంటనే ‘ఇండియన్‌ రైల్వేస్‌ సేవ’ యాప్‌ను ఆశ్రయించాడు. 

రైల్వే మంత్రికి రాత్రి 11 గంటల సమయంలో ఆ యువకుడు ట్వీట్‌ చేశాడు. ఆరు నిమిషాల్లోనే అధికారులు యువతి ఉన్న బోగీ వద్దకు చేరుకుని వివరాలు ధ్రువీకరించుకున్నారు. తర్వాతి స్టేషన్‌ అయిన అరసికేరు అధికారులకు సమాచారమివ్వగా.. వారు ఆమెకు కావాల్సిన సామగ్రిని సిద్ధం చేశారు. ట్రైన్‌ రాగానే వాటిని అందించారు. గతంలోనూ పలువురు ప్రయాణికులు చేసిన ట్వీట్లకు రైల్వేశాఖ స్పందించి కావాల్సిన సహాయం అందించింది. 

click me!