అంత్యక్రియల నుంచి.. పోస్టుమార్టంకి మృతదేహం

Published : Jan 18, 2019, 10:56 AM IST
అంత్యక్రియల నుంచి.. పోస్టుమార్టంకి మృతదేహం

సారాంశం

మరికాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించాల్సిన మృతదేహాన్ని.. పోలీసులు వచ్చి పోస్టుమార్టం కి తరలించారు. 

మరికాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించాల్సిన మృతదేహాన్ని.. పోలీసులు వచ్చి పోస్టుమార్టం కి తరలించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గోధన గ్రామానికి చెందిన 50ఏళ్ల  మహిళ.. బుధవారం కన్నుమూసింది. దీంతో ఆ రోజు సాయంత్రం కుటుంబసభ్యులు అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. ఆమె చితిని కూడా ఏర్పాటుచేశారు. మరొకొన్ని నిమిషాల్లో ఆమె చితికి నిప్పుపెడతారు అనగా.. పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కి తరలించారు.

అయితే.. ఆమెది సహజ మరణం కాదని.. భర్తే హత్య చేశాడంతో మహిళ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది హత్య అని బయటకు తెలియకుండా ఉండేందుకు వెంటనే అంత్యక్రియలు చేస్తున్నారంటూ ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ అంత్యక్రియలను అడ్డుకున్నారు. మృతిరాలి భర్తతోపాటు ఆయన కుటుంబసభ్యులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు ని బట్టి కేసు తదుపరి దర్యాప్తు సాగిస్తామని పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport