నాలుగు నెలల్లోనే మూడు జాతీయ అవార్డులు అందుకుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. జలవనరుల నిర్వహణ, పరిరక్షణలో రాష్ట్రం సాధించిన విజయాలకు ఈ గుర్తింపు లభించింది. సీఎం యోగికి అధికారులు ఈ అవార్డులను అందజేశారు.
లక్నో : సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో జలవనరుల నిర్వహణ, పరిరక్షణలో ఉత్తరప్రదేశ్ అద్భుతంగా రాణిస్తోంది. ఈ కృషికి గుర్తింపుగా నాలుగు నెలల్లోనే మూడు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను అందుకున్న అధికారులు సీఎంకు అందజేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా నీటిని అందించడంతో పాటు జలవనరుల పరిరక్షణ, నిర్వహణలోనూ రాష్ట్రం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. దీంతో ఉత్తమ రాష్ట్రం విభాగంలో దేశంలోనే రెండో స్థానం దక్కింది. ఇటీవలే (అక్టోబర్‌లో) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ఉత్తరప్రదేశ్ అధికారులను అందించారు..దీన్ని అధికారులు యోగికి అందజేశారు. ఈ విభాగంలో ఒడిశాకు మొదటి స్థానం, గుజరాత్, పుదుచ్చేరికి సంయుక్తంగా మూడో స్థానం దక్కింది.
జలజీవన్ మిషన్ కింద నాలుగు నెలల్లోనే ఉత్తరప్రదేశ్ మూడు అవార్డులు అందుకుంది. ఇంటింటికీ నల్లా నీటి పథకం కింద అత్యధిక గృహాలకు నల్లా నీటిని అందించింది ప్రభుత్వం... ఇది గుర్తించిన కేంద్రం అవార్డుతో ప్రశంసించింది. స్వచ్ఛ గంగా మిషన్ కింద గంగానది శుద్ధి, ఇతర నదుల పరిరక్షణ కార్యక్రమాలకు జూలై 13న స్కాచ్ గోల్డ్ అవార్డు లభించింది.
నోయిడా ఇంటర్నేషనల్ ట్రేడ్ షో-2024లో జలజీవన్ మిషన్ కార్యక్రమాలు, విజయాల ప్రదర్శనకు ఉత్తమ ప్రదర్శన అవార్డును కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సెప్టెంబర్ 27న అందజేశారు. ఈ అవార్డును కూడా అధికారులు సీఎం యోగికి అందజేశారు.
జలవనరుల పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా నీటి సరఫరాకు అక్టోబర్ 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జల పురస్కారాన్ని అందజేశారు. ఈ విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు రెండో స్థానం దక్కింది.నమామి గంగే, గ్రామీణ జల సరఫరా విభాగం తమదైన ప్రత్యేకమైన స్మారక చిహ్నాన్ని రూపొందించింది. దీన్ని కూడా గురువారం సీఎం యోగికి అందజేశారు.
నమామి గంగే అదనపు ముఖ్య కార్యదర్శి అనురాగ్ శ్రీవాస్తవ ఈ అవార్డులను సీఎం యోగికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం అధికారులను ప్రశంసించారు. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధించిందని కొనియాడారు. ఇంటింటికీ నల్లా నీటి పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం శుద్ధజలం అందించాలని సూచించారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ తో జరిగిన ఈ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి బృజ్‌రాజ్ సింగ్ యాదవ్, జల శాస్త్రవేత్త అనుపమ్ శ్రీవాస్తవ్ తదితరులు పాల్గొన్నారు.