మైనర్ బాలుడికి చిత్రహింసలు: ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి

Published : May 29, 2019, 12:03 PM IST
మైనర్ బాలుడికి చిత్రహింసలు: ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి

సారాంశం

:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో 16 ఏళ్ల  మతిస్థిమితం లేని బాలుడిని సమీప బంధువులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయమై ప్రశ్నించిన బాధితుడి కుటుంబసభ్యులపై కూడ నిందితులు దాడికి దిగారు. ఈ ఘటన ఈ నెల 26వ తేదీన చోటు చేసుకొంది. 

లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో 16 ఏళ్ల  మతిస్థిమితం లేని బాలుడిని సమీప బంధువులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయమై ప్రశ్నించిన బాధితుడి కుటుంబసభ్యులపై కూడ నిందితులు దాడికి దిగారు. ఈ ఘటన ఈ నెల 26వ తేదీన చోటు చేసుకొంది. 

మతిస్థిమితం సరిగా లేని బాలుడు కొంతమంది పిల్లలతో ఆడుకొంటున్న సమయంలో బాలుడి బంధువులు అతడిని చిత్రహింసలకు గురి చేశారు. బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌ వద్ద చిత్రహింసలకు గురి చేస్తూ వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ విషయం తెలుసుకొన్న బాధితుడి కుటుంబసభ్యులు నిందితుల ఇంటి వద్దకు చేరి ఈ విషయమై ప్రశ్నించారు. బాధితుడి కుటుంబసభ్యులపై కూడ నిందితులు దాడికి దిగారు.  ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై వాస్తవాలు తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రవీణ్ కుమార్ యాదవ్ చెప్పారు. నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu