ఆ డబ్బు వాళ్లను వెచ్చగా వుంచుతోంది.. పవర్‌లో లేకపోతే తెలిసేది : అమిత్ షాకు మాయావతి కౌంటర్

By Siva KodatiFirst Published Jan 1, 2022, 5:11 PM IST
Highlights

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖజానాలోని డబ్బు వారిని చల్లటి వాతావరణంలో కూడా వెచ్చగా ఉంచుతోందని సెటైర్లు వేశారు. అధికారంలో లేనప్పుడు వారు కూడా మనలాగే ఉన్నారని మాయావతి దుయ్యబట్టారు. తమ పార్టీ ప్రచారశైలి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. బీజేపీని యూపీ ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేదని మాయావతి అన్నారు.

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ఇటీవల మొరాదాబాద్‌లోని అలీగఢ్ నుంచి ఉన్నావో వరకు జన విశ్వాస్ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మాయావతి ప్రచారానికి కూడా రావడం లేదని, చలి వల్ల బయటకు రావడం లేదంటూ సెటైర్లు వేశారు. బెహన్ జీ బయటకు రావాలంటూ డిమాండ్ చేశారు.

దీనిపై స్పందించిన మాయావతి.. అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఖజానాలోని డబ్బు వారిని చల్లటి వాతావరణంలో కూడా వెచ్చగా ఉంచుతోందని సెటైర్లు వేశారు. అధికారంలో లేనప్పుడు వారు కూడా మనలాగే ఉన్నారని మాయావతి దుయ్యబట్టారు. తమ పార్టీ ప్రచారశైలి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. బీజేపీని యూపీ ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేదని మాయావతి అన్నారు.

Also Read:సగం పూర్తయిన ప్రాజెక్ట్‌ల వల్ల బీజేపీకి నో యూజ్: మాయావతి ఘాటు వ్యాఖ్యలు

కాగా.. up assembly elections 2022  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఎలాగైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని ప్ర‌ధాన పార్టీల‌న్ని ప్రణాళిక‌లు ర‌చిస్తున్నాయి. దీనిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ముమ్మ‌రం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలు తాము అధికారంలోకి వస్తే తీసుకురాబోయేప‌థ‌కాలు, హామీలు గురించి చెబుతూ ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నాయి. 

అయితే, రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని బీజేపీ నేత‌, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. 350 కి పైగా స్థానాలు గెలుచుకుంటామ‌ని చెబుతున్నారు. మ‌ళ్లీ అధికార పీఠం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ స‌ర్కారు ఎన్నిక‌ల ప్రణాళిక‌ల‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేప‌థ్యంలోనే సీఎం యోగి ఆధిత్య‌నాథ్ విద్యార్థుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. సుమారు 4700 కోట్ల రూపాయ‌ల విలువైన ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను విద్యార్థుల‌కు ఉచితంగా అందిస్తామ‌ని తెలిపారు. మొత్తం 6.8 మిలియ‌న్ల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు అందిస్తామని  యోగి స‌ర్కారు తెలిపింది.  

click me!