ఇండిపెండెన్స్ డే వేడుకల్లో యూపీ పోలీసుల నాగిన్ డ్యాన్స్.. వీడియో వైరల్

By Mahesh KFirst Published Aug 18, 2022, 5:42 PM IST
Highlights

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు నాగిన్ డ్యాన్స్ చేయడం సంచలనంగా మారింది. పిలిభిత్ జిల్లాకు చెందిన పురాన్‌పూర్ పోలీసు స్టేషన్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ నాగిన్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వారిద్దరినీ ఉన్నత అధికారులు ట్రాన్స్‌ఫర్ చేశారు.

లక్నో: ఈ ఏడాది స్వాతంత్ర్య దిన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అన్ని వర్గాలు 75 వసంతాలు నింపుకున్న స్వేచ్ఛ భారతిలో సంబురాలు చేసుకున్నారు. కానీ, యూపీ పోలీసుల సంబురాలు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, మరో కానిస్టేబుల్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా నాగిన్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లోని పురాన్‌పూర్ పోలీసు స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

నాగిన్ బ్యాండ్‌కు ఎస్ఐ, కానిస్టేబుల్ కాలు కదిపారు. ఒకరు ట్రంపెట్‌తో పామును రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తున్నారు. కానిస్టేబుల్ నాగిన్ డ్యాన్స్‌లో పాములా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ నాగిన్ డ్యాన్స్ చేస్తుండగా చుట్టూ చూస్తున్నవారు చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేశారు.

जब दारोगा जी बने सपेरा, नागिन कांस्टेबल को अपनी बीन पर नचाया।😂 pic.twitter.com/eVHCx3hJgo

— Jaiky Yadav (@JaikyYadav16)

అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టి పడింది. ఈ నాగిన్ డ్యాన్స్ చేసిన ఇద్దరినీ మరో చోటికి ట్రాన్స్‌ఫర్ చేశారు. 

ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తలిచింది. ఏడాది నుంచి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. తాజాగా, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించింది.

click me!