Lottery: లక్ అంటే నీదే భయ్యా.. 25 ఏండ్ల పాటు నెలనెలా రూ 5.5 లక్షలు.. 

Google News Follow Us

సారాంశం

Lottery: దుబాయ్ ఏజెన్సీలు. దుబాయ్‌లో పనిచేస్తున్న భారతీయ ఆర్కిటెక్ట్‌ని యునైటెడ్ అరబ్... భారతీయుడు దుబాయ్‌లో మెగా ప్రైజ్‌ని గెలుచుకున్నాడు, 25 సంవత్సరాల పాటు నెలకు రూ. 5.5 లక్షలు అందుకుంటారు
 

Lottery: దుబాయ్‌లో పనిచేస్తున్న ఓ భారతీయ ఆర్కిటెక్ట్ UAEలో కొత్త మెగా లక్కీడ్రాలో మొదటి విజేతగా ఎంపికయ్యాడు. వాస్తవానికి లక్షల రూపాయాల లాటరీ తగిలితేనే ఆ ఆనందానికి అవధులుండవ్.. అసలు ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా ప్రతి నెలా రూ. 5.5 లక్షల చొప్పున దాదాపు 25 సంవత్సరాల పాటు డబ్బులను అందుకోనున్నాడు. ఇలాంటి లక్కీ డ్రాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ ఆదిల్ ఖాన్ గెలుచుకున్నాడు. 

వివరాల్లోకెళ్లే  దుబాయ్ లోని ఫాస్ట్ 5 డ్రాలో మెగా ప్రైజ్ విజేతగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ ఆదిల్ ఖాన్ ఎంపికైనట్లు గల్ఫ్ న్యూస్ నివేదించింది. అతడు దుబాయ్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడని తెలిపింది.  అతడ
ఖాన్ లాటరీని గెలుచుకున్న తర్వాత 25 సంవత్సరాలకు నెలకు రూ.5,59,822 పొందుతారు. ఈ గెలుపుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఇది చాలా ముఖ్యమైన సమయంలో వచ్చిందని ఖాన్ అన్నారు.

'నా కుటుంబం కోసం సంపాదిస్తున్న ఏకైక వ్యక్తి నేనే. నా సోదరుడు మహమ్మారి సమయంలో మరణించాడు. నేను అతని కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాకు వృద్ధ తల్లిదండ్రులు , ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. అందుకే సమయానికి అదనపు డబ్బు వస్తుంది. ఈ వార్త తెలుసుకున్న తర్వాత తాను చాలా ఆశ్చర్యపోయానని ఖాన్ చెప్పారు. తాను ఈ విషయాన్ని తన కుటుంబానికి కూడా చెప్పాననీ, వారు నమ్మలేదనీ,  వార్తల్లో నిజానిజాలు రెండుసార్లు సరిచూసుకోవాలని ఆయన అన్నారు.