ప్రేయసికి బలవంతంగా అబార్షన్ మాత్రలు..పెళ్లికి క్షణాల ముందు వరుడు అరెస్ట్..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 09, 2020, 05:15 PM IST
ప్రేయసికి బలవంతంగా అబార్షన్ మాత్రలు..పెళ్లికి క్షణాల ముందు వరుడు అరెస్ట్..

సారాంశం

ప్రేమించాడు.. నమ్మించాడు.. తీరా గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకోమంటూ బలవంతంగా మాత్రలు మింగించాడు. తాను మాత్రం మరో వధువుతో పెళ్లికి సిద్ధమయ్యాడు. నమ్మిన పాపానికి ఆ అమ్మాయి మరణించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. 

గర్భస్రావం మాత్రలు మింగించి ప్రియురాలి చావుకు కారణమైన ఓ యువకుడిని పెళ్లికి కొన్ని నిమిషాల ముందు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్‌కు చెందిన రాహుల్‌ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతిని పెళ్లి పేరు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆమె గర్భవతి అయిందని తెలిసి బలవంతంగా గర్భస్రావం అయ్యే మాత్రలు మింగించాడు.

దీంతో ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమె మీరట్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ మేరకు రాహుల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడు ఉన్న చోటుకు వెళ్లారు. అక్కడ అతడి పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లికి మరి కొన్ని నిమిషాలు మాత్రమే ఉండగా పోలీసులు రాహుల్‌ను అరెస్ట్‌ చేశారు. పలు సెక్షన్ల క్రింద అతడిపై కేసులు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Budget Friendly Cars : కొత్తగా జాబ్ లో చేరినవారు కూడా కొనగలిగే టాప్ 5 కార్లు ఇవే..
Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu