
UP Election News 2022 : ఎన్నికలకు ముందు బీజేపీ (bjp) నుంచి సమాజ్ వాదీ (samajwadi party) పార్టీలోకి జంప్ అయిన నాయకులపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) ఫైర్ అయ్యారు. ఈ సారి వారు సీట్లను దక్కించుకోవడానికి చాలా కష్టపడుతున్నారని అన్నారు. సమాజ్ వాదీ పార్టీలో చేరిన నాయకులను స్మాల్ టైమ్ లీడర్లు (small time leaders)గా అభివర్ణించిన యోగి.. ఆ నాయకులకు మాస్ బేస్ ఉంటే తాను గోరఖ్‌పూర్ (gorakhpur) నుంచి పోటీ చేసినట్లుగా వారు కూడా వారి సాంప్రదాయ స్థానాల నుంచి పోరాడాలని ఛాలెంట్ చేశారు. ఆయన శనివారం ఓ ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక అంశాలను అక్కడ చర్చించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 80 శాతం సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన 20 శాతం ఓట్ల కోసం ఎస్పీ (sp), బీఎస్పీ (bsp), కాంగ్రెస్ (congress)ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొందని అన్నారు. జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాల ఆధారంగా బీజేపీ ఈ ఎన్నికల్లో పోరాడుతోందని తెలిపారు. కైరానా, రాంపూర్, మౌలలో ప్రొఫెషనల్ నేరగాళ్లకు టిక్కెట్లు ఇవ్వడం పట్ల సమాజ్ వాదీ పార్టీపై యోగి ఆదిత్యనాత్ మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ దుష్పరిపాలనను మరిచిపోలేదని అన్నారు. వారి పార్టీ పేరు సమాజ్‌వాదీ అని, అయితే వారు ‘దంగవాడీ’ అని, వారి మనస్తత్వం ‘పరివార్‌వాడి’ అని పునరుద్ఘాటించారు. యూపీలో జాతీయవాదులు, సంక్షేమ పథకాల పట్ల సానుకూలంగా ఆలోచించే వారు 80 శాతం మంది ఉన్నారనీ, మాఫియా పాలన, నేరాలు, అరాచకాలు, అవినీతిని ఇష్టపడే వారు 20 శాతం మంది ఉన్నారని సీఎం అన్నారు. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తే తమ పార్టీ 300 సీట్లకు పైగా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా తమ కూటమి 300 సీట్లకు పైగా గెలుస్తుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) మామ, ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ సింగ్ యాదవ్ (shivapal singh yadav) శనివారం అన్నారు. ఫలితాల ప్రకటన రోజున అధికారంలో ఉన్న బీజేపీకి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని చెప్పారు.
యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. 2017 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి అధికారం చేపట్టింది. అంతకు ముందు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఈ సారి ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి అధికారంలోకి రావాలని ఎస్పీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే బీజేపీ కూడా రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (congress) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన కాంగ్రెస్ ఈ సారి ఒంటరిగానే బరిలో నిలిచింది. అయితే సమాజ్ వాదీ పార్టీ ఆర్ఎల్ డీ (RLD) తో కలిసి పోరులో నిలిచింది. యూపీలో ఇప్పటి వరకు రెండు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. ఆదివారం మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి.