కేంద్ర మంత్రికి శివసేన వార్నింగ్.. ‘నీ జాతకం మా చేతిలో ఉంది’

Published : Feb 19, 2022, 07:48 PM IST
కేంద్ర మంత్రికి శివసేన వార్నింగ్.. ‘నీ జాతకం మా చేతిలో ఉంది’

సారాంశం

మహారాష్ట్రలో శివసేన, బీజేపీల మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. పరస్పరం ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా, కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శివసేన నేతలకు ఈడీల నుంచి నోటీసులు అందనున్నట్టు తెలిసిందని హెచ్చరించారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు. ఆయన జాతకం తమ దగ్గర ఉన్నదని మండిపడ్డారు.  

ముంబయి: మహారాష్ట్ర(Maharashtra)లో శివసేన, బీజేపీల మధ్య వాగ్వాదం ముదురుతున్నది. కొన్నాళ్లుగా శివసేన నేతల స్కామ్‌లు అంటూ బీజేపీ నేతలు కొన్ని డాక్యుమెంట్లు బయట పెడుతున్నారు. అదే తీరులో బీజేపీ నేతల అవినీతి అంటూ శివసేన నేతలూ సోషల్ మీడియాలో వివరాలు పెడుతున్నారు. ఈ వాగ్వాదం మెల్లగా వేడెక్కుతున్నది. కేంద్ర మంత్రి, బీజేపీ నేత నారాయణ్ రాణె ఇటీవలే శివసేన నేతలకు నోటీసులు వస్తాయని హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు.

‘నువ్వు కేంద్ర మంత్రి కావచ్చు. కానీ, ఇది మహారాష్ట్ర. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మేం నీకు బాప్‌ ఇక్కడ. దీని అర్థం ఏమిటో త్వరలోనే నీకు తెలిసి వస్తుంది’ అని సంజయ్ రౌత్ నారాయణ్ రాణెపై ఫైర్ అయ్యారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కార్యాలయంలో ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ నివాసం మాతో శ్రీలోని నలుగురికి నోటీసులు పంపడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది అని కేంద్ర మంత్రి నారాయణ్ రాణె హెచ్చరించారు. దీని గురించి సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. తమ జాతకం ఆయన దగ్గర ఉన్నదని మాట్లాడుతున్నాడని, ఆయన జాతకం తమ దగ్గర ఉన్నదని హెచ్చరించారు. 

అదే సమయంలో బీజేపీ ఎంపీ కిరిత్ సోమయపైనా విరుచుకుపడ్డారు. శివసేన నేతల అవినీతిని వెల్లడిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్న కిరిత్ సోమయ అవినీతి బాగోతాన్ని తాను బయటపెడుతానని వార్నింగ్ ఇచ్చారు. నువ్వు చెబుతున్న స్కామ్ డాక్యుమెంట్లు కేంద్ర ఏజెన్సీలకు ఇవ్వు.. మేమూ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇస్తా అని అన్నారు. అంతేకాదు, పాల్‌గడ్‌లో రూ. 260 కోట్ల ప్రాజెక్ట్‌కు ఎవర పెట్టుబడి దారులు? అంటూ అడిగారు. ఆ ప్రాజెక్టుకు పేరు కిరిత్ సోమయ తనయుడి పేరు ఉంటే.. ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆయన భార్య ఉన్నారని పేర్కొన్నారు.

గతేడాది కేంద్ర మంత్రి నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మార్చికల్లా మహారాష్ట్రలో BJP ప్రభుత్వం వస్తుందని ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అంతేకాదు, ప్రభుత్వాన్ని కూల్చడమా? ఏర్పాటు చేయడమా? అని మాట్లాడుతూ కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రంలో మహావికాస్ అఘాదీ Shivsena, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి)ఉన్నది. సీఎంగా Uddhav Thackeray బాధ్యతల్లో ఉన్న సంగతి తెలిసిందే. 

\ఉద్ధవ్ ఠాక్రేకు, నారాయణ్ రాణేకు మధ్య కొంత కాలం క్రితం వాగ్యుద్ధం మళ్లీ తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఆయన మాటలో మాటగా చాలా సాధారణంగా మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం పడిపోతుందని, మార్చి కల్లా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. కొందరు విలేకరులకు సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమాధానం విలేకరులు సైతం ఖంగుతిన్నారు. క్లారిటీ కోసం మళ్లీ మళ్లీ ప్రశ్నించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన అదే సమాధానం చెప్పారు.

వచ్చే మార్చిలోగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు మార్పు కనిపిస్తుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అన్నారు. దీంతో ఎప్పటికల్లా బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారు? అంటూ మళ్లీ ప్రశ్నించారు. అంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నది కదా.. మార్చిలోపే బీజేపీ ప్రభుత్వం వస్తుందా? అని అడిగారు. దీనికి ఆయన ‘మరి మీరు చెప్పండి ఎప్పటికల్లా బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందో?’ అంటూ తిరిగి ప్రశ్న సంధించారు. తమ కంటే కేంద్రమంత్రికే ఈ విషయం ఎక్కువ తెలిసి ఉంటుందని విలేకరులు అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?