నోట్ల కట్టలతో  భార్య, పిల్లలు సెల్ఫీలు.. చిక్కుల్లో పడ్డ పోలీసు అధికారి ..

Published : Jun 30, 2023, 06:18 AM IST
నోట్ల కట్టలతో  భార్య, పిల్లలు సెల్ఫీలు.. చిక్కుల్లో పడ్డ పోలీసు అధికారి ..

సారాంశం

రూ.500 నోట్ల కట్టలతో తన భార్య, పిల్లలు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ పోలీసు అధికారి  చిక్కుల్లో పడింది.  

ఇటీవల సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకోవడం కమాన్ అయ్యింది. తాజాగా ఓ పోలీసు అధికారి భార్య, పిల్లలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటోకు .. అతడ్ని వెంటనే బదిలీ చేసి .. ఆ అతనిపై విచారణకు ఆదేశించారు. సోషల్ మీడియాలో ఫోటో పోస్టు చేస్తే బదిలీ కావడమేంటని అనుకుంటున్నారా..?  అయితే.. ఆ కథేంటో తెలుసుకుందాం.. 

వివరాల్లోకెళ్లే..  ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో రమేష్‌ చంద్ర సహాని సబ్-ఇన్‌స్పెక్టర్ పని చేస్తున్నారు.ఇటీవల ఆ అధికారి భార్య, అతని పిల్లలు నోట్ల కట్టలతో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ సెల్ఫీ వైరల్ కావడంతో ఆ అధికారిపై విచారణ ఆదేశించారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలో ఆ అధికారిని వెంటనే మరో ప్రాంతానికి  బదిలీ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటోలో 14 లక్షల రూపాయల విలువైన నగదును ఒక బెడ్‌పై పెట్టి..  ఆ నోట్ల కట్టల పక్కన పోలీసు అధికారి భార్య , ఇద్దరు పిల్లలు కూర్చోని ఫోజు ఇవ్వడం ఆ ఫోటోలో చూడవచ్చు.నోట్ల కట్టల ఫోటో వైరల్ కావడంతో, వెంటనే సీనియర్ పోలీసు అధికారిపై దర్యాప్తుకు ఆదేశించారు. స్టేషన్‌ ఇన్‌చార్జి రమేష్‌ చంద్ర సహాని  బదిలీ అయ్యారు.అయితే.. రమేష్ చంద్ర సహాని తనను తాను సమర్థించుకున్నాడు.ఆ ఫోటో నవంబర్ 14, 2021న తాను కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు తీసుకున్నదని చెప్పాడు.
 
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. ఒక సీనియర్ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడాడు. బెహతా ముజావర్ స్టేషన్-హౌస్ ఆఫీసర్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఆ పోలీసు అధికారి భార్య , అతని పిల్లలను చూడవచ్చు. వారు నోట్ల కట్టలను చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులు తీస్తున్నారు. ము ఈ విషయాన్ని గుర్తించాము. ఆ పోలీసు అధికారి బదిలీ చేయబడ్డాడు. అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu