రామమందిర శంకు స్థాపన.. భక్తులకు యోగి స్పెషల్ ట్వీట్

By telugu news teamFirst Published Aug 5, 2020, 11:54 AM IST
Highlights

ఈ అద్భుత ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఇదని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా 12గంటల 40 నిమిషాలకు ప్రధాని మోదీ శంకు స్థాపన చేయనున్నారు.
 

అయోధ్యలో రామమందిర శంకు స్థాపనకు సర్వం సిద్ధమయ్యింది. హిందువులంతా ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తరుణం నేడు కళ్లముందు ఆవిష్కారం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. రామ భక్తులకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా జై శ్రీరామ్ ట్వీట్ చేశారు.

ఇప్పటికే.. ఈ అద్భుత ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఇదని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా 12గంటల 40 నిమిషాలకు ప్రధాని మోదీ శంకు స్థాపన చేయనున్నారు.

ఇదిలా ఉండగా..  రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన సందర్భంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాముడిని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. రాముడు అందరివాడని, అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడంటూ మంగళవారం ప్రియాంక ట్వీట్‌ చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బుధవారం జరిగే భూమిపూజ కార్యక్రమం జాతీయ ఐక్యతను చాటే సాంస్కృతిక సమ్మేళనంగా నిలిచిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. నిరాడంబరత, ధైర్యం, సహనం, త్యాగం, అంకితభావాలకు ప్రతీక అయిన రాముడు అందరితో ఉంటాడని ప్రియాంక  ట్వీట్‌ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన ప్రియాంక గాంధీ ఆ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఇందులో భాగంగా యోగి సర్కార్  ప్రభుత్వ విధానాలపై విరుచుకు పడుతున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జరిగే భూమిపూజకు కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమంలో 100మందికిపైగా వీఐపీలు పాల్గొంటారని భావిస్తున్నారు.  
 

click me!