తండ్రి చనిపోయిన నెలకే తల్లి రెండో పెళ్లి.. నచ్చని కొడుకు ఏం చేశాడంటే...

Published : Jun 06, 2020, 08:34 AM ISTUpdated : Jun 06, 2020, 08:52 AM IST
తండ్రి చనిపోయిన నెలకే తల్లి రెండో పెళ్లి.. నచ్చని కొడుకు ఏం చేశాడంటే...

సారాంశం

గతేడాది బాలుడి తండ్రి గుండెపోటుతో మరణించాడు. తండ్రి చనిపోయిన నెల రోజులకే తల్లి మరో పెళ్లి చేసుకుంది. ఈ విషయం ఆ బాలుడు జీర్ణించుకోలేకపోయాడు. తన తండ్రి స్థానంలో వచ్చిన మరో వ్యక్తిని చూసి అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు.

తల్లి రెండో పెళ్లి చేసుకోవడం అతనికి నచ్చలేదు. తన తండ్రి స్థానంలో మరో వ్యక్తి వచ్చి నిలబడటం జీర్ణించుకోలేకపోయాడు. దీంతో.. సవతి తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి తన సవతి తండ్రిని అతి దారుణంగా హత్య చేశాడు. గతంలో మూడుసార్లు ప్రయత్నించి విఫలమవ్వగా.. నాలుగోసారి మరోసారి ప్రయత్నించి.. అతనిని చంపేయడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్ పూర్ కి చెందిన 15ఏళ్ల మైనర్ బాలుడు  స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కాగా.. గతేడాది బాలుడి తండ్రి గుండెపోటుతో మరణించాడు. తండ్రి చనిపోయిన నెల రోజులకే తల్లి మరో పెళ్లి చేసుకుంది. ఈ విషయం ఆ బాలుడు జీర్ణించుకోలేకపోయాడు. తన తండ్రి స్థానంలో వచ్చిన మరో వ్యక్తిని చూసి అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు.

ఎలాగైనా సవతి తండ్రిని చంపేయాలని అనుకున్నాడు. ఈ మేరకు తన స్నేహితులతో కలిసి మూడుసార్లు ప్రయత్నించాడు. అయినా.. అతని ప్రయత్నం ఫలించలేదు. దీంతో.. ఇటీవల మరోసారి ప్రయత్నించాడు. స్నేహితులతో కలిసి బైక్ మీద వెళ్లి.. సవతి తండ్రిని అడ్డుకున్నాడు. తొలుత ఇనుప రాడ్లతో దాడి చేశాడు. ఆ తర్వాత కత్తితో పొడిచి, తుపాకీతో కాల్చి మరీ చంపేశాడు.

ఈ ఘాతుకాన్ని చూసిన మృతుడి సోదరుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలుడు తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు