ఉన్నావ్ అత్యాచారం కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెనగర్ ను దోషిగా తేల్చింది.
ఉన్నావ్ అత్యాచారం కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెనగర్ ను దోషిగా తేల్చింది. అతన్ని దోషిగా తేల్చిన కోర్టు శిక్షను ఇంకో రెండు రోజుల తరువాత ఖరారు చేయనుంది. ఈ నెల 19వ తేదీన శిక్ష ఖరారు చేయనున్నట్టు ఢిల్లీలోని తిస్ హజారియా కోర్టు పేర్కొంది.
ఈ తీర్పును స్వాగతిస్తున్నట్టు బీజేపీ నాయకులు సైతం సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కూడా వెల్ డన్ అండ్ ఎక్సలెంట్ అని ట్వీట్ చేశారు.
Well done n Excellent ! 👍🏻👍🏻 https://t.co/qfQgwMS5ch
— Rajeev Chandrasekhar 🇮🇳 (@rajeev_mp)
undefined
ఒక మైనర్ అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేసి, ఆ తరువాత కోర్టుకు ప్రయాణిస్తున్న సమయంలో ఆమెను చంపబోయాడని కూడా కేసులు నమోదయ్యాయి. ఆ సదరు యువతీ, ఆమె తరుఫు లాయర్ ప్రయాణిస్తున్న కారుని ట్రక్కు గుద్దడంతో ఆ యువతి రెండు రోజులు చావుబ్రతుకుల్లో కొట్టుమిట్టాడి బ్రతికి బట్టగట్టింది.
ఇక ఈ సదరు ఎమ్మెల్యేపై బీజేపీ బహిష్కరణ వేటు వేసింది.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. హత్యాయత్నం ఘటనలో ప్రతిపక్షాలు బీజేపీపై నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆయన బహిష్కరణకు గురవడం గమనార్హం.
కుల్ దీప్ సెంగర్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన బాధితురాలి కారును రాయ్‌బరేలీలో జులై 28న ఒక లారీ బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో బాధితురాలి పిన్ని, అత్త చనిపోయారు. విపక్షాలు ప్రశ్నలు సంధించాయి. నిందితుడు సెంగార్, అతడి బంధువులు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇకపోతే గతంలో ఈ కేసుకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉన్నావ్ అత్యాచారం, హత్యాచార యత్నానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలంటూ నిర్ణయం తీసుకుంది.
ఉన్నావ్ అత్యాచారం ఘటనకు సంబంధించిన అన్ని కేసులను ఉత్తర ప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే ఉన్నావ్ బాధితురాలి అత్యాచారం అనంతరం జరిగిన పరిణామాలపై సీబీఐ పూర్తి వివరాలు అందజేయాలని కోరింది.
ఈ నేపథ్యంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ సంపత్ మీనా కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐకి పలు సూచనలు చేసింది. బాధితురాలికి సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించాలని ఆదేశించింది.
45 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే హత్యాయత్నం కేసుకు సంబంధించి వారం రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. బాధితురాలు కుటుంబ సభ్యులు కోరితే ఢిల్లీలో ఆమెకు చికిత్స అందించాలని ఆదేశించింది.
అత్యాచార బాధితురాలికి తక్షణమే రూ.25లక్షలు పరిహారం అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇకపోతే ఈ కేసును రాజీ చేసుకోవాలంటూ ప్రధాన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అనుచరుల నుంచి అత్యాచార బాధితురాలికి, ఆమె బంధువులకు బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలి కుటుంబం సీజే దృష్టికి తీసుకెళ్లింది. బాధితురాలకి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని ఆదేశించింది.
ఉన్నావ్ అత్యాచారం కేసుతో పాటు ఇటీవల బాధితురాలి కారును లారీ ఢీకొన్న ఘటనపైనా వివరాలు వారం రోజుల్లో సమర్పించాలని అప్పటి సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ సీబీఐని ఆదేశించారు. అలాగే రెండు కేసులను 45 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసారు.