అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్: నవంబర్ 30 వరకు పొడిగింపు

By narsimha lodeFirst Published Oct 27, 2020, 5:17 PM IST
Highlights

కరోనా నేపథ్యంలో ఆన్ లాక్  5.0 నిబంధనలను మరో నెల రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.దేశంలో రికవరీ రేటు భారీగా పెరిగింది. ప్రతి రోజూ నమోదౌతున్న కేసులతో సమానంగా కరోనా నుండి కోలుకొంటున్న రోగుల సంఖ్య కూడ సమానంగా ఉంటుంది. 


న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఆన్ లాక్  5.0 నిబంధనలను మరో నెల రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.దేశంలో రికవరీ రేటు భారీగా పెరిగింది. ప్రతి రోజూ నమోదౌతున్న కేసులతో సమానంగా కరోనా నుండి కోలుకొంటున్న రోగుల సంఖ్య కూడ సమానంగా ఉంటుంది. 

దీంతో ఆన్ లాక్ 5.0 నిబంధనలను మరోసారి పొడిగిస్తున్నట్టుగా కేంద్రం మంగళవారం నాడు ప్రకటించింది.నవంబర్ 30 వ తేదీ వరకు కంటైన్మెంట్ జోన్లలో ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నట్టుగా కేంద్రం తెలిపింది.

అంతరాష్ట్ర కదలికలపై ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక అనుమతి, ఆమోదం, ఈ పర్మిట్లు అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది.

కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని రకాల కార్యక్రమాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ ప్రయాణాలు, స్విమ్మింగ్ పూల్స్, వ్యాపార సమావేశాలు, ఎగ్జిబిషన్లకు అవకాశం కల్పిస్తూ సెప్టెంబర్ 30న ఆన్ లాక్ 5.0ని కేంద్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. 

క్లోజ్డ్ మీటింగ్ హాల్స్ లో 50 శాతం వరకే అనుమతిస్తారు. ఇది కూడా 200 మందికి కూడ మించకూడదని కేంద్రం సూచించింది.మాస్కులు, భౌతిక దూరం పాటించడం ధర్మల్ స్కానింగ్ తప్పనిసరని కేంద్రం తేల్చి చెప్పింది.

కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా  కంటైన్మెంట్ జోన్ల బయట రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించకూడదని  కేంద్రం సూచించింది.
 

click me!