జర్నలిస్టుతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వాగ్వాదం.. వీడియో పోస్టు చేస్తూ మండిపడ్డ కాంగ్రెస్.. వైరల్

Published : Jun 11, 2023, 10:27 AM IST
జర్నలిస్టుతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వాగ్వాదం.. వీడియో పోస్టు చేస్తూ మండిపడ్డ కాంగ్రెస్.. వైరల్

సారాంశం

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఓ జర్నలిస్టుకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారికి ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. కేంద్ర మంత్రిపై విమర్శలు చేసింది. 

అమేథీ లోక్ సభ నియోజకవర్గ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓ జర్నలిస్టుతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్టు చేస్తూ మండిపడింది. అందులో ‘‘ ఓ విలేకరి ప్రశ్నలు అడిగినందుకు ఆయనను కేంద్ర మంత్రి బెదిరించారు’’ అని ఆరోపించింది. ‘‘బహుశా ఆ జర్నలిస్టు 13 రూపాయలకు చక్కెర ఎప్పుడు దొరుకుతుంది ? లేదా గ్యాస్ సిలిండర్ ధర ఎప్పుడు తగ్గుతుంది? లేక కూతుళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు?  అని అడిగారేమో.. ఆమె సమాధానం చెప్పలేకపోయి బెదిరింపులకు దిగింది. స్మృతి ఇరానీ గారూ.. ఇది ప్రేమ కాదు..’’ అని వీడియోకు క్యాప్షన్ పెట్టింది.

13 ఏళ్ల బాలిక కిడ్నాప్.. లాడ్జీలో బంధించి 10 రోజుల పాటు రేప్.. సంచలన తీర్పు చెప్పిన కోర్టు

ఇంతకీ ఏం జరిగిందంటే ? 
ఆ వీడియోను పీయూష్ రాయ్ అనే వ్యక్తి షేర్ చేశారు. అందులో ఓ రిపోర్టర్ (దైనిక్ భాస్కర్ కు చెందిన 'జర్నలిస్ట్' అని చెప్పుకుంటున్నారు) అమేథీలో బీజేపీ నేత, కేంద్ర స్మృతి ఇరానీతో వాగ్వాదానికి దిగడం కనిపిస్తోంది. ‘మీరు దైనిక్ భాస్కర్ కు చెందిన వారైనా నా నియోజకవర్గ ప్రజలను అవమానించకండి. నేనేమిటో నాకు తెలుసు.. ఇక్కడి ప్రజలను కించపర్చకండి.’’ అని కేంద్ర మంత్రి చెప్పడం కనిపిస్తోంది. దీనిపై ఆ జర్నలిస్ట్ స్పందిస్తూ.. ‘‘నేను ఎవరినీ కించపరచడం లేదు. మొదటిసారి మీ యాక్టివిటీ గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా లేరు.’’ అని అన్నారు. 

మళ్లీ స్మృతి ఇరానీ తన కారులో కూర్చొని అతడిని మందలించారు. ‘‘మీరు ఇలాగే మాట్లాడితే నేను మీ సూపర్వైజర్లకు చెప్పాల్సి ఉంటుంది. ప్రజలను కించపరిచే హక్కు జర్నలిస్టులకు లేదు. వారికి (మీ ఉన్నతాధికారులకు) ఫోన్ చేసి చెబుతాను’’ అని ఆమె హెచ్చరించారు. ‘‘మీరు పెద్ద రిపోర్టర్ కావచ్చు. కానీ సామాన్య ప్రజలను కించపరిచే హక్కు మీకు లేదు. ఈ విషయాన్ని ఎంతో గౌరవంగా, ప్రేమతో చెబుతున్నా.. నా ప్రజలను మరోసారి అవమానించకండి.’’ అని అన్నారు. 

‘దైనిక్ భాస్కర్’ ఏం చెప్పిందంటే ?  
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో వాగ్వాదానికి దిగి, వైరల్ అయిన ఈ వీడియోపై ‘దైనిక్ భాస్కర్’ స్పందించింది. కేంద్ర మంత్రిని ప్రశ్నలు అడిగిన వ్యక్తికి తమ పత్రికతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ స్మృతి ఇరానీతో ఓ జర్నలిస్ట్ వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ గా మారింది. విపిన్ యాదవ్ అనే వ్యక్తి  దైనిక్ భాస్కర్ రిపోర్టర్ గా చెప్పుకుంటున్నాడు. అది అవాస్తవం. అమేథీ లోక్ సభ నియోజకవర్గంలో దైనిక్ భాస్కర్ కు ఎలాంటి పర్మినెంట్ ఉద్యోగి లేరు. మేము వార్తల సేకరణ కోసం మా స్ట్రింగర్ (ఫ్రీలాన్స్ జర్నలిస్ట్) నెట్ వర్క్ తో కలిసి పనిచేస్తాం. అలాంటి స్ట్రింగర్లలో కూడా విపిన్ ఒకడు కాదు.’’ అని పేర్కొంది.

అసహజ శృంగారం కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు - తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఆరోపణలు

కాగా.. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. ‘అమేథీ ప్రజలతో దురుసుగా ప్రవర్తించవద్దు. ఇది మీకు అర్థం కాని అభ్యర్థన. అమేథీ ప్రజల అవమానాన్ని మీరు భరించగలరు కానీ నేను భరించలేను. ఇక ప్రశ్నల విషయానికి వస్తే మాజీ ఎంపీ (రాహుల్ గాంధీ)తో ఎప్పుడు చర్చించాలో చెప్పండి. పంచదార, పిండి, పప్పుల ధరలను కూడా చెప్పగలను’’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?