భర్త కోసం ఎగ్‌ ఫ్రైడ్ రైస్ చేసిన స్మృతీ ఇరానీ: నేర్చుకునే వారి కోసం రెసీపీ

Siva Kodati |  
Published : Feb 12, 2020, 04:51 PM ISTUpdated : Feb 12, 2020, 04:58 PM IST
భర్త కోసం ఎగ్‌ ఫ్రైడ్ రైస్ చేసిన స్మృతీ ఇరానీ: నేర్చుకునే వారి కోసం రెసీపీ

సారాంశం

నటి, నిర్మాత, రాజకీయవేత్త, చిత్రకారిణీ ఇలా అన్ని రంగాల్లో తనదైన ప్రతిభ చూపుతూ పలువురికి ఆదర్శంగా నిలిచారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. తాజాగా వంటలో తన ప్రావీణ్యతను సైతం ప్రదర్శించారు.

నటి, నిర్మాత, రాజకీయవేత్త, చిత్రకారిణీ ఇలా అన్ని రంగాల్లో తనదైన ప్రతిభ చూపుతూ పలువురికి ఆదర్శంగా నిలిచారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. తాజాగా వంటలో తన ప్రావీణ్యతను సైతం ప్రదర్శించారు. ఇటీవల తన కుమార్తె కోసం హక్కా నూడిల్స్‌, చికెన్ మంచూరియాను తయారు చేసిన స్మృతీ.. ఈసారి తన భర్త జుబిన్ ఇరానీ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను వండిపెట్టారు.

ఈ రెసీపీని ఆమె తన అభిమానులతో పంచుకునేందుకు వీలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. మొత్తం ఏడు దశలలో ఆమె ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను తయారు చేసే విధానాన్ని పిక్-బై-పిక్‌ గైడ్ రూపంలో అందించారు. ఇది కేవలం కొత్త వారికేనంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. 

స్టెప్-1: అల్లం, క్యారట్లు, ఉల్లిపాయలను సన్నగా కోయాలి

 

 

స్టెప్-2: ఉల్లికాడలను కూడా కోసిపెట్టుకోవాలి

 

 

స్టెప్-3: షిటాకే పుట్టగొడుగులను వేడి నీటిలో నానబెట్టండి

 

 

స్టెప్-4: బియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి..

 

 

స్టెప్-5: ఇప్పుడు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్లు, అల్లం, ఉల్లికాడలతో పాటు గుడ్డుని పగలగొట్టి ప్యాన్ లో నూనె వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయాలి (మరి ఎక్కువసేపు వేయించకూడదు)

 

 

స్టెప్-6: వేయించిన మిశ్రమానికి బియ్యం, ఓస్టెర్ సాస్, లైట్ సోయా సాస్, ఉప్పు మరియు మిరియాల పొడిని కలపాలి

 

 

స్టెప్-7: ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ఆరగించి, ఆనందించండి

 


 

PREV
click me!

Recommended Stories

Bhajan Clubbing : మోదీ మెచ్చిన భజన్ క్లబ్బింగ్.. ఇందులో అంత కిక్ ఏముంది? అసలు ఏంటిది?
Attari-Wagah Border Republic Day:భారత్- పాక్ సరిహద్దుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠ | Asianet News Telugu