వచ్చే ఏడాది 'సముద్రయాన్' .. 'మత్స్య 6000' జలాంతర్గామి ఫోటోలను షేర్ చేసిన కేంద్రమంత్రి

Published : Sep 12, 2023, 05:03 AM IST
వచ్చే ఏడాది 'సముద్రయాన్' .. 'మత్స్య 6000' జలాంతర్గామి ఫోటోలను షేర్ చేసిన కేంద్రమంత్రి

సారాంశం

Samudrayaan: చంద్రుడు, సూర్యుడి తర్వాత ఇప్పుడు సముద్రపు లోతును కొలవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మిషన్ 'సముద్రయాన్' మొదటి పరీక్ష జరుగుతుంది. ఈ మిషన్ లో భాగంగా నావికులు స్వదేశీ జలాంతర్గామి మత్స్య 6000లో సముద్రంలో ఆరు కిలోమీటర్ల లోతుకు వెళతారు. సముద్రపు లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది.

Samudrayaan: భారతదేశ చంద్రయాన్-3 మిషన్.. చంద్రుని అనేక రహస్యాలను బహిర్గతం చేయడంతో పాటు, అక్కడ ఆక్సిజన్‌ను కూడా కనుగొంది. ఈ మిషన్ విజయవంతమైన కొన్ని రోజుల తర్వాత, ఆదిత్య L1 సూర్యుని జాతకాన్ని పరిశోధించడానికి పంపబడింది. భారతదేశపు తొలి సన్ మిషన్ ఆదిత్య ఎల్1 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణంలో ముందుకు సాగుతోంది. చంద్రుడు, సూర్యుడి తర్వాత ఇప్పుడు సముద్రపు లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకునే వంతు వచ్చింది. దీని కోసం భారతదేశం సముద్రయాన్ మిషన్‌ను సిద్ధం చేస్తోంది.

మత్స్య 6000 ఆరు కిలోమీటర్ల లోతుకు 

సముద్రయాన్ మిషన్ భాగంగా స్వదేశీ జలాంతర్గామి మత్స్య 6000 సముద్రంలో ఆరు కిలోమీటర్ల లోతు వరకు ముగ్గురు నావికులను తీసుకువెళుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో సముద్రయాన తొలి పరీక్ష జరగవచ్చని చెబుతున్నారు. మిషన్ సముద్రయాన్ కింద రహస్యాన్ని అన్వేషించడానికి సముద్రపు లోతుల్లోకి డైవ్ చేసే మానవసహిత సబ్‌మెర్సిబుల్ మత్స్య 6000ని కేంద్ర భూ శాస్త్రాల మంత్రి కిరెన్ రిజిజు సోమవారం పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను కేంద్ర మంత్రి Kiren Rijiju సోషల్ మీడియా 'X'లో పోస్ట్ చేసి ఇలా పేర్కొన్నారు. ఇప్పుడు సముద్రయాన్ వంతు. సబ్‌మెర్సిబుల్ మత్స్య 6000 చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో నిర్మించబడింది. సముద్రయాన్ మిషన్ లో భాగంగా లోతైన సముద్రంలో భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత మిషన్ ఇది. సముద్రంలో ఆరు కిలోమీటర్ల లోతుకు ముగ్గురు నావికులను పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యాత్రికులు సముద్రంలోని వనరులు, జీవవైవిధ్యాన్ని అధ్యయనం చేస్తారు.

చంద్రయాన్-3ని ఎప్పుడు ప్రయోగించారు?

చంద్రయాన్-3ని జూలై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రయోగించారు. ఇది ఆగస్టు 23 సాయంత్రం 6:04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అదే సమయంలో దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశం భారతదేశం.

ఆదిత్య L1 ఎప్పుడు లాంచ్ చేయబడింది?

ఆదిత్య ఎల్1 ఆగస్టు 2న ఉదయం 11:50 గంటలకు ప్రారంభించబడింది. ఇది 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న ఎల్1 పాయింట్‌కి వెళ్లి సూర్యుడిని అధ్యయనం చేస్తుంది.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?