‘బుద్ధం శరణం గచ్ఛామి’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి..

Published : May 11, 2023, 11:13 AM IST
 ‘బుద్ధం శరణం గచ్ఛామి’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి..

సారాంశం

కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి బుధవారం బుద్ధం శరణం గచ్ఛామి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. న్యూ ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి బుధవారం బుద్ధం శరణం గచ్ఛామి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. న్యూ ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. సీనియర్ బౌద్ధ సన్యాసులు,  రాయబారులు, దౌత్యవేత్తలు, మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఈ ఎగ్జిబిషన్‌ను మీనాక్ష లేఖి ప్రారంభించారు. డ్రెపుంగ్ గోమాంగ్‌కు చెందిన కుండెలింగ్ తత్సక్ రింపోచే ఈ  కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది.

బుద్ధ పూర్ణిమ తర్వాత వారంలో నిర్వహించబడిన ఎగ్జిబిషన్ బుద్ధ భగవానుడి జీవితం ఆధారంగా రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ కళ, సంస్కృతి జర్నీని ప్రదర్శించింది. పలు విభాగాలుగా విభజించబడిన ఆధునిక భారతీయ కళ దిగ్గజ కళాఖండాలను ప్రదర్శించడం జరిగింది. ప్రతి ఒక్కటి బౌద్ధమతం మరియు బుద్ధుని జీవితంలోని విభిన్న కోణాన్ని ప్రదర్శించింది. ప్రదర్శనలో ఉంచబడిన ఈ కళాత్మక రచనలు బౌద్ధమతం చరిత్ర, తత్వశాస్త్రంలో ఒక సంగ్రహావలోకనం అందిస్తాయి.

సీనియర్ బౌద్ధ భిక్షువుల మంత్రోచ్ఛారణల మధ్య జ్యోతి ప్రజ్వలన, అంగవస్త్ర సమర్పణతో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఆ తర్వాత కవితా ద్విబేది, ఆమె బృందంచే ఒడిస్సీ నృత్య శైలిలో మోక్షం స్త్రీ వైభవాన్ని ప్రదర్శించే ‘‘శ్వేతా ముక్తి’’ ప్రదర్శన జరిగింది.

కుండెలింగ్ రింపోచే సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. బుద్ధుని బోధనలలో కరుణ ఔచిత్యాన్ని, ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కరుణను పాటించాలని కోరారు. ఇది మానవులలోనే కాదు.. మానవులకు, ఉనికిలో ఉన్న అన్ని జీవుల మధ్య ముఖ్యమైనదని ఆయన అన్నారు. బౌద్ధమతానికి సంబంధించిన కళలను ప్రదర్శించేందుకు మీనాక్షి లేఖి పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో మోడరన్ ఆర్ట్ గ్యాలరీ ఇటువంటి విశేష కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇక, ఈ ఈవెంట్‌ను నిర్వహించిన సహజ పరిస్థితులను ప్రత్యేకంగా ప్రశంసించారు.

మీనాక్షి లేఖి మాట్లాడుతూ..  బుద్ధుని బోధనలు 2500 సంవత్సరాల క్రితం వలె నేటికీ చాలా సందర్భోచితంగా ఉన్నాయని పేర్కొన్నారు. సిద్ధార్థ గౌతముడు లుంబినీలో జన్మించినప్పటికీ, అతనికి జ్ఞానోదయం బోధ్ గయలో అయిందని అన్నారు. నేపాల్, భారత్‌లలోని ఈ రెండు ప్రదేశాలు.. ఈ రోజు రెండు దేశాలను గట్టిగా బంధించాయని పేర్కొన్నారు. భారతదేశం బౌద్ధ తత్వశాస్త్రానికి మాత్రమే కాకుండా కళ, సంస్కృతికి కూడా కేంద్రంగా ఉందని.. అందువల్ల బౌద్ధమతం విలువలను ప్రపంచానికి అందించడం భారతదేశం బాధ్యత అని పేర్కొన్నారు. ఇది భారతదేశ భావజాలం స్వచ్ఛత, భౌతికవాదం, విలువ వ్యవస్థలతో పాటు ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి అని ఆమె అన్నారు. 

మీనాక్షి లేఖి ప్రకారం.. ‘‘బుద్ధం శరణం గచ్చామి’’ బౌద్ధమతంతో ముడిపడి ఉన్న కొన్ని అరుదైన, ప్రత్యేకమైన కళలను.. ముఖ్యంగా కళాకారుడు నందలాల్ బోస్ రచనలను ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలో భాగం. ఇక, గణనీయమైన బౌద్ద జనాభాను కలిగి ఉన్న నేపాల్, మయన్మార్, మంగోలియా, దక్షిణ కొరియా, థాయిలాండ్, భూటాన్ మొదలైన దేశాలు ఈ ప్రదర్శనకు హాజరయ్యాయి. ఈ ప్రదర్శనలో డెన్మార్క్, గ్రీస్, లక్సెంబర్గ్, జమైకా, పోర్చుగల్, జార్జియా, ఐస్‌లాండ్, ఈక్వెడార్, సిరియా, పెరూ వంటి దేశాల నుండి రాయబారులు, అనేక ఇతర దేశాల నుండి సీనియర్ దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లో శ్రీలంక, మయన్మార్ వంటి దేశాల నుంచి పెయింటింగ్‌లను ప్రదర్శించారు. 

దిగ్గజ భారతీయ కళాకారుడు నందలాల్ బోస్ బుద్ధుని జీవితం, బోధనలు,  ఆధ్యాత్మికత మార్గాన్ని లైన్ డ్రాయింగ్‌ల ద్వారా అతీంద్రియ నాణ్యతతో అన్వేషించారు. ఇక, ఈ ఎగ్జిబిషన్ జూన్ 10 వరకు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ ప్రజల కోసం తెరిచి ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్