బిజెపికి ఎదురు దెబ్బ: కేంద్ర మంత్రి హర్సిమ్రాత్ బాదల్ రాజీనామా

Published : Sep 17, 2020, 07:56 PM ISTUpdated : Sep 17, 2020, 07:59 PM IST
బిజెపికి ఎదురు దెబ్బ: కేంద్ర మంత్రి హర్సిమ్రాత్ బాదల్ రాజీనామా

సారాంశం

వ్యవసాయ రంగానికి చెందిన బిల్లులను వ్యతిరేకిస్తూ బిజెపి మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కు చెందిన హర్సీమ్రాత్ బాదల్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీినాామా చేశారు. అయితే, అకాలీదళ్ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయనుంది.

న్యూఢిల్లీ: బిజెపి మిత్ర పక్షం శిరోమణి అకాలీదళ్ కు చెందిన హర్సిసిమ్రాత్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వ్యవసాయ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ ఆమె రాజీనామా చేశారు.

వ్యవసాయ రంగానికి ెచందిన బిల్లలను లోకసభలో ఆమోదించడానికి కొద్ది గంటల ముందు ఆమె రాజీనామా చేశారు. తాము ఎన్డీఎ ప్రభుత్వానికి, బిజెపికి మద్దతు కొనసాగిస్తామని ఆమె భర్త, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ బాదల్ చెప్పారు. రైతు వ్యతిరేక విధానాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

హర్యానా, పంజాబ్ రైతులు కొన్ని వారాలుగా నిరసనలు తెలుపుతున్నారని, ఈ బిల్లులు ఈ రాష్ట్రాల రైతులను నిరాశకు గురి చేస్తాయని ఆయన అన్నారు. ఆ చట్టాలను తొలుత శిరోమణి అకాలీదళ్ బలపరిచింది. అయితే, నష్టం జరిగే అవకాశం ఉందని భావించి వెనక్కి తగ్గింది. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు బిల్లులను ఆపాలని అకాలీదళ్ కోరింది. అయితే బిజెపి వినలేదు. 

బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ సభలో ఓటు వేసే అవకాశం ఉంది. బిల్లులకు మద్దతును ఉపసహరించుకుంది. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం