ఆ అప్పడాలు తింటే కరోనా రాదన్న కేంద్రమంత్రికి పాజిటివ్

By Siva KodatiFirst Published Aug 9, 2020, 5:13 PM IST
Highlights

అప్పడం తినడం ద్వారా కరోనా వైరస్ రాకుండా నియంత్రించవచ్చంటూ ప్రకటించి వివాదం రేపిన కేంద్ర మంత్రి అర్జున్ మేఘావాల్ ఆ మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. 

అప్పడం తినడం ద్వారా కరోనా వైరస్ రాకుండా నియంత్రించవచ్చంటూ ప్రకటించి వివాదం రేపిన కేంద్ర మంత్రి అర్జున్ మేఘావాల్ ఆ మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.

తనకు రెండుసార్లు కరోనా టెస్టులు జరిగాయని, రెండోసారి పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని, రెండోసారి కన్ఫర్మ్ అయ్యింది.

వైద్యుల సలహా మేరకు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరానని మేఘావాల్ తెలిపారు. తనతో కొద్దిరోజులుగా సన్నిహితంగా మెలిగిన వారంతా దయచేసి కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అర్జున్ మేఘావాల్ ప్రస్తుతం కేంద్ర భారీ పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ భాబీ జీ పాపడ్’’ తింటే కరోనా రాదని, ఆ అప్పడాలు మనిషిలో రోగనిరోధక శక్తి, యాంటీబాడీస్‌ను పెంపొందిస్తాయని అర్జున్ అన్నారు.

మరోవైపు ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా బారినపడ్డారు. హోంమంత్రి అమిత్ షా కోవిడ్ బారినపడి ఈ రోజే కోలుకున్నారు. కాగా భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా 64,399 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 21,53,010కి చేరింది. నిన్న ఒక్కరోజే 861 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 

click me!