అమిత్ షాకు బెంగాల్ కోర్టు సమన్లు.. తమ ఎదుట హాజరవ్వాలని ఆదేశం

By Siva KodatiFirst Published Feb 19, 2021, 7:30 PM IST
Highlights

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు న్యాయస్థానం షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్‌‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు సమన్లు జారీచేసింది.

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు న్యాయస్థానం షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్‌‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు సమన్లు జారీచేసింది. టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్‌ బెనర్జీ వేసిన పరువు నష్టం దావా కేసులో ఈ సమన్లు ఇచ్చింది.

ఫిబ్రవరి 22న విచారణకు హాజరు కావాలని అమిత్‌ షాకు సూచించింది. వ్యక్తిగతంగా, లేదా లాయర్‌ ద్వారా గానీ సోమవారం 10 గంటలకు న్యాయస్థానానికి హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.   

2018 ఆగస్టు 11న కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ పరువుకు నష్టం కలిగించేలా అమిత్‌ షా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ అభిషేక్‌ తరఫు న్యాయవాది సంజయ్‌ బసు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అమిత్‌ షా బెంగాల్‌ పర్యటనలోనే ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న బెంగాల్‌కు వచ్చిన ఆయన.. ఐదో విడత పరివర్తన్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. 

click me!