మహారాష్ట్రలో పెరిగిన కరోనా కేసులు: మళ్లీ లాక్‌డౌన్

Published : Feb 19, 2021, 05:30 PM IST
మహారాష్ట్రలో పెరిగిన కరోనా కేసులు: మళ్లీ లాక్‌డౌన్

సారాంశం

మహారాష్ట్రలో మరోసారి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా లాక్‌డౌన్ విధించింది.  ప్రతి రోజూ 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదౌతున్నాయి.  దీంతో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా లాక్‌డౌన్ విధించింది.  ప్రతి రోజూ 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదౌతున్నాయి.  దీంతో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ముంబైలో సరికొత్త కరోనా నిబంధనలు విధిస్తూ బృహన్ ముంబై కార్పోరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైతో పాటు విదర్భ ప్రాంతాల్లో రెండు జిల్లాలో సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు.విదర్భ ప్రాంతంలోని అమరావతి, యావత్మాల్ జిల్లాలో పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అమరావతి జిల్లాలో వారాంతాల్లో లాక్ ‌డౌన్ ను పాకిక్షంగా సడలించారు. ఇక ముంబైలో శుభకార్యాలు, సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తూ కార్పోరేషన్ నిర్ణయం తీసుకొంది. మాస్క్ లు లేకుండా తిరిగే వారిని గుర్తించేందుకు 300 మంది మార్షల్స్ ను బీఎంసీ ఏర్పాటు చేసింది. మాస్క్ లు లేని వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నారు.

కరోనా కేసుల నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ వరకు విద్యాలయాలన్నీ మూసివేస్తూ యావత్కాల్ జిల్లా అధికారులు ప్రకటించారు. పెళ్లిళ్లకు కేవలం 50 మంత్రిని మాత్రమే అనుమతిస్తూ కలెక్టర్‌ డీఎం సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హోటల్స్‌ ఉదయం 8 నుంచి రాత్రి 9.30 గంటల వరకు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరచుకోవచ్చు. రెండు జిల్లాల్లో రాత్రిళ్లు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయించారు. రాత్రి కర్ఫ్యూ వాతావరణం అమల్లో ఉండనుంది.

ఇప్పటివరకు మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య: 20,81,520. మృతుల సంఖ్య 51,669. 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu