శెభాష్.. మావోలతో పోరుపై తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస

By Siva KodatiFirst Published Aug 26, 2019, 4:07 PM IST
Highlights

మావోయిస్టులను ఎదుర్కోవడంలో దేశానికి తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలో మావోయిస్టు ప్రాంతాల్లోని పరిస్థితిని అంచనా వేసేందుకు గాను కేంద్ర హోం శాఖ ఢిల్లీలో భద్రత, అభివృద్ధి, గిరిజన హక్కులపై నిర్వహించిన సమావేశంలో అమిత్ షాకు కేంద్ర హోంశాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది

మావోయిస్టులను ఎదుర్కోవడంలో దేశానికి తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

దేశంలో మావోయిస్టు ప్రాంతాల్లోని పరిస్థితిని అంచనా వేసేందుకు గాను కేంద్ర హోం శాఖ ఢిల్లీలో భద్రత, అభివృద్ధి, గిరిజన హక్కులపై నిర్వహించిన సమావేశంలో అమిత్ షాకు కేంద్ర హోంశాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది.

అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.

ఈ సమావేశానికి తెలంగాణ  హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఛత్తీస్ గఢ్ సీఎం భాఘెల్, బీహార్ సీఎం నితీష్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆయా రాష్ట్రాల డీజీపీలు పాల్గొన్నారు. 

click me!