రాజ్యసభ ముందుకు ఈబీసీ బిల్లు.. సవరణ కోరిన డీఎంకే

sivanagaprasad kodati |  
Published : Jan 09, 2019, 12:35 PM IST
రాజ్యసభ ముందుకు ఈబీసీ బిల్లు.. సవరణ కోరిన డీఎంకే

సారాంశం

అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఈబీసీ బిల్లును కేంద్రప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రమంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ 124వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 

దీనిని తొలి నుంచి అడ్డుకుంటున్న విపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. చర్చ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి బిల్లుకు సవరణ కోరారు..

ఈబీసీ బిల్లును పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి పంపాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని మోసగించడం ఆపాలంటూ డీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. మరోవైపు ఈబీసీ బిల్లుపై చర్చకు దూరంగా ఉండాలని పలు పార్టీలు నిర్ణయించగా, ఆర్జేడీ తాము దూరంగా ఉన్నట్లు ప్రకటించింది.

నిన్న ఈబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ ఎంపీల బలం ఉండటంతో దిగువ సభలో బిల్లు సునాయసంగా ఆమోదం పొందింది. ఓటింగ్‌లో మొత్తం 326 మంది సభ్యులు పాల్గొనగా ఈబీసీ బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు అనుకూలంగా, వ్యతిరేకంగా 3 ఓట్లు పడ్డాయి.

PREV
click me!

Recommended Stories

త్వరలో ప్లాస్టిక్ నోట్లు...ఇక పాత నోట్లు బ్యాన్ చేస్తారా? | Plastic Currency in India
బిజెపి బిగ్ బాస్ కే చుక్కలు చూపించిన బిహారీ వ్యూహకర్త.. ఉపఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అద్భుత విజయం