ఈబీసీ రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

sivanagaprasad kodati |  
Published : Jan 08, 2019, 01:23 PM IST
ఈబీసీ రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

సారాంశం

అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ‘‘ ఈబీసీ రిజర్వేషన్ బిల్లును’’ కేంద్రప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 

అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ‘‘ ఈబీసీ రిజర్వేషన్ బిల్లును’’ కేంద్రప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మధ్యాహ్నం సభ ప్రారంభమైన వెంటనే కేంద్రమంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లను 50 శాతానికి మించి అమలు చేయరాదు.. దీనికి అడ్డుగా ఉన్న అధికరణను సవరించేందుకు వీలుగా 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. బిల్లు ఆమోదం పొందడానికి 2/3 సభ్యుల మెజారిటీ అవసరం. లోక్‌సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నందున బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే