విమానంలో ప్రయాణికురాలిని అసభ్యంగా తాకుతూ...

Published : Jan 08, 2019, 12:41 PM IST
విమానంలో ప్రయాణికురాలిని అసభ్యంగా తాకుతూ...

సారాంశం

విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలి పట్ల ఓ బిజినెస్ మెన్ అసభ్యంగా ప్రవర్తించాడు.

విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలి పట్ల ఓ బిజినెస్ మెన్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ.. లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త  అనిల్ కుమార్ మూల్ చందానీ(65) విస్తారా విమానయాన సంస్థకు చెందిన విమానంలో ముంబయికి బయలు దేరారు. అదే విమానంలో భారత సంతతికి చెందిన సింగపూర్ మహిళ ప్రయాణిస్తోంది. ఆమె అనిల్ కుమార్ పక్కసీట్లో కూర్చుంది.

కాగా.. దీనిని అవకాశంగా తీసుకున్న అనిల్ కుమార్.. ఆమెను అసభ్యంగా తాకుతూ..లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె అతనిపై సహారా విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడైన అనిల్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Pension Scheme : అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 7 పొదుపు చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ !
V2V Technology : ఇక యాక్సిడెంట్లు ఉండవ్.. కార్లే డ్రైవర్లను అలర్ట్ చేస్తాయి ! ఏమిటీ V2V టెక్నాలజీ?