భారత అమ్ములపొదిలో చేరిన రాఫెల్: ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్ ఆయుథపూజ

By Siva KodatiFirst Published Oct 8, 2019, 3:54 PM IST
Highlights

భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ యుద్ధ విమానం చేరింది. విజయదశమి సందర్భంగా మంగళవారం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా రాఫెల్‌కు ఆయన ఆయుధ పూజ నిర్వహించారు.

భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ యుద్ధ విమానం చేరింది. విజయదశమి సందర్భంగా మంగళవారం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

ఈ సందర్భంగా రాఫెల్‌కు ఆయన ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలపై మెక్రాన్, రాజ్‌నాథ్‌లు చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్ మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఫ్రాన్స్ రక్షణ శాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో రాజ్‌నాథ్ బుధవారం సమావేశమై.. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం బలోపేతంపై చర్చిస్తారు. తొలి విడతలో భాగంగా భారత్‌కు 36 రాఫెల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. 
 

click me!