వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్..!!

Published : Jul 05, 2023, 02:22 PM ISTUpdated : Jul 05, 2023, 02:30 PM IST
వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్..!!

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ రోజు ఉదయం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీలకమైన వ్యక్తిగత  డేటా రక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ రోజు ఉదయం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రానున్న వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న వ్యక్తిగత  డేటా రక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు డ్రాఫ్ట్‌ను 2022 నవంబర్‌లో ప్రచురించారు. ఈ బిల్లు సవరించిన సంస్కరణల ప్రకారం.. కేవలం వ్యక్తిగత డేటాపై మాత్రమే దృష్టి పెడుతుంది. తద్వారా వ్యక్తిగతేతర డేటా వినియోగాన్ని నియంత్రించకుండా చేస్తుంది. 

గతేడాది నవంబర్ వెర్షన్ ప్రకారం.. డేటా విశ్వసనీయత పిల్లల ట్రాకింగ్ లేదా ప్రవర్తనా పర్యవేక్షణ లేదా పిల్లలను ఉద్దేశించి ప్రకటనలు చేయరాదని ఈ బిల్లు పేర్కొంది. నిబంధనలు పాటించని పక్షంలో రూ.500 కోట్ల వరకు జరిమానా విధించేందుకు అవకాశం కల్పించనుంది. 

అయితే 2018లో జస్టిస్ బీఎస్ శ్రీకృష్ణ కమిటీ మొదటి ముసాయిదాను రూపొందించినప్పటి నుంచి అనేక విమర్శలను ఎదుర్కొన్న పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ఉపసంహరణ కారణంగా.. ఈ బిల్లు అవసరం అయింది. ఇది వ్యక్తిగత డేటాను కేంద్రీకరించడం ద్వారా.. ఇది వ్యక్తిగతేతర డేటా వినియోగాన్ని నియంత్రించకుండా చేయనుంది

ఇక, ఈ బిల్లు గత సంస్కరణ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు, 2019.. పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన తర్వాత మాత్రమే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయబడిందని గుర్తుంచుకోవాలి. ఇది రెండేళ్లకు పైగా జేపీసీ పరిశీలనలో ఉంది. 2021 డిసెంబర్‌లో కమిటీ తన నివేదికను సమర్పించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు సవరణలు ప్రతిపాదిచడంతో.. సమ్మతి సంబంధిత ఆందోళనలను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంది.

PREV
click me!

Recommended Stories

India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu
Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి| Asianet News Telugu