
2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగానే బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్నాయి.
గతంలో లాగానే మోడీ రెండో ప్రభుత్వంలోని తొలి బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని యూనివర్సిటీలకు నామమాత్రపు కేటాయింపులు చేశారు నిర్మల.
ఏపీలోని సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు, అలాగే ఏపీ ట్రైబల్ వర్సిటీకి రూ. 8 కోట్లు కేటాయించారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకి రూ. 80 కోట్లు కేటాయించారు.