అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర.. వారి లొసుగులన్నీ తెలుసు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

Published : Aug 04, 2021, 11:21 AM IST
అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర.. వారి లొసుగులన్నీ తెలుసు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

సమాజ్ వాదీ పార్టీ నేతలు సైకిల్ యాత్రలు చేపట్టినా, పాదయాత్రలు చేపట్టినా ప్రజలకు అటువంటి నేతల లొసుగులు వ్యవహారాలన్నీ స్పష్టంగా తెలుసునని వ్యాఖ్యానించారు. 

లక్నో : సమాజ్ వాదీపార్టీ అధ్యక్ఉడు (ఎస్పీ) అఖిలేష్ యాదవ్ చేపట్టబోతున్న సైకిల్ యాత్రపై ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంద్రదేవ్ సింగ్ పలు విమర్శలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు సైకిల్ యాత్రలు చేపట్టినా, పాదయాత్రలు చేపట్టినా ప్రజలకు అటువంటి నేతల లొసుగులు వ్యవహారాలన్నీ స్పష్టంగా తెలుసునని వ్యాఖ్యానించారు. 

ఆ నేతల గూండాగిరి, అవినీతి వ్యవహరాలు, వారసత్వ రాజకీయాలు అందరికీ తెలిసినవేనని అన్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ సమాజ్ వాదీ పార్టీ ఘోరంగా విఫలం చెందిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ ల సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport