
Prophet Muhammad Controversy: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆ వ్యాఖ్యలపై వివాదం పెరుగుతోంది. తొలుత అరబ్ దేశాలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.. అదే సమయంలో.. ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. భారతదేశానికి సహనంగా ఉండాలని సలహా ఇచ్చింది. ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. అన్ని మతాల పట్ల గౌరవం, సహనంతో వ్యవహరించాలని సూచించింది.
ప్రవక్త మహమ్మద్‌పై బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ జర్నలిస్టు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ను స్పందించాలని కోరింది. ఈ మేరకు ప్రతిస్పందనగా.. UN సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ మాట్లాడుతూ.. విలేకరుల సమావేశంలో ఇలా అన్నారు, "నేను కథలను చూశాను. ఈ వ్యాఖ్యను నేను స్వయంగా చూడలేదు, కానీ నా ఉద్దేశ్యం. అన్ని మతాల పట్ల గౌరవం, సహనాన్ని మేము బలంగా ప్రోత్సహిస్తున్నామని నేను మీకు చెప్పగలను. అని సమాధానమిచ్చారు.
బీజేపీ నేతల వ్యాఖ్యలపై అరబ్ దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యంగా గల్ఫ్, అరబ్ దేశాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఖతార్, కువైట్, ఇరాన్ వంటి దేశాల్లో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారాలు జరిగాయి. కొన్ని దేశాల్లోని భారత రాయబారులను పిలిపించి ప్రకటనను కూడా ఖండించారు. అదే సమయంలో, కువైట్‌లో కూడా భారతీయ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు. సూపర్‌స్టోర్‌ల నుండి భారతీయ ఉత్పత్తులను తీసివేయడం మరియు అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అనేక వీడియోలు వెలువడ్డాయి. అరబ్ మీడియా దీనిని దౌత్య తుఫానుగా అభివర్ణిస్తోంది.
అరబ్ దేశాల నుంచి నానాటికీ పెరుగుతున్న ఒత్తిడి, అంతర్జాతీయ సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో బీజేపీ నవీన్ జిందాల్, నుపుర్ శర్మలను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. దీని తర్వాత, పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని, ఎటువంటి మత వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించదని పార్టీ నుండి ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. పాకిస్థాన్‌కు ధీటుగా సమాధానం ఇచ్చిన భారత్.. ముందుగా పాక్ లో మైనారిటీల హక్కులను కాపాడాలని పేర్కొంది. అదే సమయంలో.. ఇస్లామిక్ దేశాల ఆర్గనైజేషన్, OICలను భారత్ ధీటైన సమాధానమిచ్చింది. విభజన చర్యనేనని.. అసంతృప్తిని వ్యక్తం చేసింది.