జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) బీహార్ విభాగం అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే ఉమేష్ కుష్వాహ ఎన్నికయ్యారు. రెండు రోజుల పాటు నిర్వహించిన జేడీయూ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో రెండో రోజైన ఆదివారం ఈ ప్రకటన వెలువడింది
జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) బీహార్ విభాగం అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే ఉమేష్ కుష్వాహ ఎన్నికయ్యారు. రెండు రోజుల పాటు నిర్వహించిన జేడీయూ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో రెండో రోజైన ఆదివారం ఈ ప్రకటన వెలువడింది.
ఉమేష్ కుష్వాహను పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, రాష్ట్రంలో పార్టీ పటిష్టత కోసం కలిసికట్టుగా పనిచేస్తామని జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు.
undefined
ఎన్డీయేతో పొత్తు విషయంలో ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్టు వస్తున్న ఊహానాగాలను రంజన్ కొట్టిపారేశారు. ఎన్డీయేలో కొనసాగేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కుష్వాహ మాట్లాడుతూ, పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని తెలిపారు. కాగా గత నెలలో జేడీయూ అధ్యక్షుడిగా ఆ పార్టీ రాజ్యసభ్య సభ్యుడు ఆర్సీపీ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.