నిరసనకారులు బిర్యానీ తింటున్నారు: బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Published : Jan 10, 2021, 06:00 PM IST
నిరసనకారులు బిర్యానీ తింటున్నారు: బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

సారాంశం

దేశ రాజధాని చుట్టూ చికెన్ బిర్యానీ తింటున్నారని దీంతో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి కారణంగా మారిందని బీజేపీ నేత, ఎమ్మెల్యే మదన్  దిలావర్ ఆరోపించారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని చుట్టూ చికెన్ బిర్యానీ తింటున్నారని దీంతో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి కారణంగా మారిందని బీజేపీ నేత, ఎమ్మెల్యే మదన్  దిలావర్ ఆరోపించారు.

 దేశంలోని ఏడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా నిర్ధారించింది. బర్డ్ ఫ్లూ నివారణకు గాను కేంద్రం ఆయా రాష్ట్రాలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు  జారీ చేసింది.

ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  రైతులు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

నిరసనకారులు చికెన్ బిర్యానీ తింటున్నారు. జీడిపప్పు తింటున్నారు. అన్ని రకాలుగా ఆనందంగా ఉంటున్నారన్నారు. తమ అవతారాన్ని తరచూ మారుస్తున్నారని చెప్పారు.

వారిలో చాలా మంది ఉగ్రవాదులు ఉండొచ్చు... దొంగలు.. దోపిడిదారులు కూడ ఉండవచ్చని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని సామరస్యపూర్వకంగా లేదా ద బలప్రయోగం ద్వారా అయినా ప్రభుత్వం వారిని తొలగించకపోతే దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలను పోస్టు చేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!