Udhayanidhi Stalin: డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు. 1970ల కాలంలో భారత్‌లో జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. జనాభాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని గుర్తు చేశారు.
Udhayanidhi Stalin: త్వరలో జరగనున్న డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణ భారత రాష్ట్రాలు ఆ విధానాలను బాగా అమలు చేశాయని.. కానీ ఇతర రాష్ట్రాలు ఆ పని చేయలేదని పేర్కొన్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న రాజకీయ పార్టీలు ఈ చర్యను ప్రతిఘటిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చైన్నైలో ABP నెట్‌వర్క్ నిర్వహించిన "ద సదరన్ రైజింగ్ సమ్మిట్"లో మంత్రి ఉదయనిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1970లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని దక్షిణ భారత రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సరిగ్గా అమలు చేయని రాష్ట్రాలతో పోల్చితే వారి జనాభా వృద్ధి రేటు మందగించింది. దీని జనాభా అధిక రేటుతో పెరుగుతూ వచ్చింది. ఇది దక్షిణ భారత రాష్ట్రాల జనాభా వాటాను సమర్థవంతంగా తగ్గించింది. ఈరోజు దక్షిణ భారత రాష్ట్రాలైన మనపై దీన్ని ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు తమ పనితీరు బాగున్నాయని వాటిని శిక్షించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ప్రతి రాష్ట్రం దాని జనాభా నిష్పత్తిలో సీట్లు పొందాలని రాజ్యాంగం ఆదేశిస్తుందనీ, నియోజకవర్గాలు జనాభాకు సమాన పరిమాణంలో ఉండాలని పేర్కొన్నారు.
1976లో పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణ వల్ల 2000 వరకు లోక్‌సభలో సీట్ల సంఖ్య స్తంభించిందన్నారు. 2001లో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చినప్పుడు.. సీట్లు కోల్పోయే అవకాశం ఉన్న రాష్ట్రాలు నిరసన తెలిపాయి. ఈ నిరసన కారణంగా.. అప్పటి ఎన్‌డిఎ ప్రభుత్వం మరొక రాజ్యాంగ సవరణను ప్రయోగాత్మకంగా తీసుకుంది. దీని ద్వారా ఫ్రీజ్‌ను మరో 25 సంవత్సరాలు పొడిగించింది. ఈ డీలిమిటేషన్ తమపై ఎలా ప్రభావం చూపుతుంది? మొత్తం ఐదు రాష్ట్రాలు - తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - లోక్‌సభలో తమ సీట్ల వాటాను కోల్పోతాయని స్పష్టమైంది. లోక్‌సభలో మొత్తం సీట్ల సంఖ్యను మార్చకుండా డీలిమిటేషన్ చేస్తేజజ తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 నుంచి 31కి 8 సీట్లు తగ్గుతాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం" అని ఆయన ఆరోపించారు.
డీలిమిటేషన్ అనేది మా తలపై వేలాడుతున్న కత్తి అని టిఎన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అన్నారు. మన హక్కులను హరించివేసేందుకు జరుగుతున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న చాలా రాజకీయ పార్టీలు ఈ చర్యను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయని ఆశిస్తున్నారు. సరైన ఆలోచన ఉన్న ప్రతి పౌరుడు ఈ చర్యను ఎదుర్కొంటాడనీ, . ఈ ప్రజా ఉద్యమంలో డీఎంకే అగ్రగామిగా ఉంటుందని ఉదయనిధి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని కేంద్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని, ఆదాయాన్ని పంచుకునే విషయంలో అసమానతలను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.