మహారాష్ట్ర : ఉద్ధవ్ థాక్రేకు షాక్ .. షిండే వర్గమే అసలైన ‘‘ శివసేన ’’గా గుర్తింపు , స్పీకర్ సంచలన నిర్ణయం

By Siva Kodati  |  First Published Jan 10, 2024, 6:44 PM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేనగా స్పీకర్ తేల్చారు. 


మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చీలిక వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు శాసన సభాపతి నిరాకరించారు. షిండే వర్గమే అసలైన శివసేనగా స్పీకర్ తేల్చారు. అనర్హత నోటీసులు జారీ చేసిన నెలల తర్వాత ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏక్‌నాథ్ షిండేకి పదవీ గండం తప్పినట్లయ్యింది. శివసేన రాజ్యాంగానికి సంబంధించిన పలు నిబంధనలను పరిగణనలోనికి తీసుకున్నట్లు స్పీకర్ వెల్లడించారు. వీటి ఆధారంగానే అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

కాగా... శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్ధవ్ థాక్రే  సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ మద్ధతుతో ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాతి నుంచి అసలైన శివసేన తమదేనంటూ ఆయన ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో 16 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే కోర్ట్ అనర్హత నోటీసులు జారీ చేసి.. నిర్ణయం స్పీకర్‌కు వదిలేసింది. 2023 ఆగస్ట్ 11 లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం స్పీకర్‌ను ఆదేశించింది. 

Latest Videos

అయితే రాహుల్ మాత్రం నెలల తరబడి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. థాక్రే వర్గం కోరినట్లు 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే.. షిండే సీఎం పదవిని వీడాల్సి వస్తుంది. ఈ క్రమంలో మహారాష్ట్రకు కొత్త సీఎం వస్తారని అంతా భావించారు. కానీ అలాంటి ఊహాగానాలకు చెక్ పెడుతూ స్పీకర్ .. షిండే వర్గానికి క్లీన్ చీట్ ఇచ్చారు. 


 


 

click me!