
Udaipur Murder Case: ఉదయ్‌పూర్ హత్య కేసు రాజస్థాన్ లో తీవ్ర ఉద్రిక్తలకు కారణమైంది. నిరసనలు, ఆందోళనలు చెలరేగడంతో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంలో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంస్థలకు సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్‌ని దారుణంగా హత్య చేయడం పాకిస్తాన్‌కు చెందిన రాడికల్ సంస్థకు చెందిన స్లీపర్ సెల్ చేసిన ఉగ్ర చర్యగా నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు ఇండియా టూ డే నివేదించింది. ఈ కేసుకు సంబంధించిన మరో ముగ్గురిని అరెస్టు చేయగా.. 10 మందికి పైగా హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
అంతకు ముందు మమహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు.. నిందితులు ఉదయ్‌పూర్ లోని ఓ ట్రైలర్ ను దారుణంగా తల నరికి హత్య చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ఈ దారుణాన్ని తమే చేశామని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోడీని బెదిరించారు. ఇస్లాం మతాన్ని అవమానపర్చినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నామని నిందుతులు విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.
దర్యాప్తునకు యాంటీ టెర్రర్ ఏజెన్సీ
ఉదయ్‌పూర్ హత్య ఒక్క రాజస్థాన్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉదయ్‌పూర్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తలకు కారణమైంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఉగ్రవాదుల హస్తం ఉందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కావడంతో కేంద్ర హోం శాఖ.. ఉదయ్‌పూర్ హత్య కేసున దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కు అప్పగించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు బుధవారం నాడు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ నిందితులపై కేసు నమోదుచేసుకునీ, దర్యాప్తును ప్రారంభించింది.
ఉదయ్‌పూర్ హత్య జరిగింది ఇలా..
మంగళవారం ఉదయ్‌పూర్ నగరంలోని మార్కెట్ సమీపంలో ఉన్న ఓ టైలరింగ్ షాపులోకి ఇద్దరు వ్యక్తులు చేరుకుని టైలరింగ్ చేసే వ్యక్తి గొంతు కోసి హత్య చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డు కావడంతో సామాజిక మాధ్యమాలల్లో వైరల్ గా మారాయి. దీంతో ఉదయ్‌పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కారణంగానే కన్హయ్య లాల్ హత్యకు గురయ్యాడని భావిస్తున్నారు. కన్హయ్య లాల్‌ను హత్య చేసిన హంతకులను గౌస్ మహ్మద్ మరియు రియాజ్ అహ్మద్‌గా గుర్తించారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత నిందితులు తామే ఈ హత్య చేసినట్టు అంగీకరిస్తూ వీడియోను పోస్టు చేశారు. మరో వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీని సైతం బెదిరించారు. ఇస్లాం మతాన్ని కించపరిచినందుకే ఈ చర్యలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ సైతం అప్రమత్తమైంది. ఈకేసు ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని ఆదేశించింది.