యూసి స్పెషల్ సర్వే... 70శాతం భారతీయుల ఓటు ఒక సంతానానికే

By Arun Kumar PFirst Published Jul 12, 2019, 9:32 PM IST
Highlights

అధిక జనాభా...ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న ముఖ్యమైన సమస్య. ఈ జనాభా పెరుగుదల  అంతకంతకు పెరగడం వల్ల కొన్ని ఆఫ్రికా దేశాలు ఏకంగా కరువు ఫీడిత దేశాలుగా మారుతున్నాయి. సామాన్యంగా ఓ మనిషి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ వంటి కనీస అవసరాలకు నోచుకోలేని స్థితికి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయి. అలాంటి గడ్డు పరిస్థితులు తమకు రాకూడదనే ప్రతి దేశం భావిస్తోంది. అందులోనూ ప్రపంచ జనాభాలో సగానికంటే ఎక్కువ శాతం  కలిగిన ఆసియా దేశాలు...మరీముఖ్యంగా ఇండియా, చైనాలు జాగ్రత్తపడకుండే ఆ దేశాల పరిస్థితి  మరింత దిగజారే అవకాశం  వుంది. 

ఇప్పటికు ప్రపంచ జనాభా 7.7 బిలియన్లకు చేరుకుంది. అందులో అధిక వాటా చైనా, ఇండియాలదే. కొన్ని సర్వేల ప్రకారం ప్రస్తుతం అధిక జనాభా కలిగిన చైనాను భారత్ 2027 నాటికి వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలవనున్నట్లు తెలుస్తోంది. అయితే  ఆర్థిక ప్రగతి, అభివృద్దిలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించకుండా ఇలా అధిక జనాభాలో టాప్ కు చేరుకోనుందన్న ఇలాంటి సర్వేలు భారత దేశ  ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి.

అయితే ఆహారం, భూమి, గాలి దొరక్క,కొన్నిసార్లు కలుషితమై ఇప్పుడున్న జనాభాలోనే చాలాచోట్ల మరణాలు  సంభవిస్తున్న కొన్ని సంఘటనల ద్వారా బయటపడిన  విషయం తెలిసిందే. వీటన్నింటిని దృష్ట్యా భారత ప్రజల్లో ఈ అధిక జనాభా వల్ల కలిగే దుష్పరిణామాల గురించి బాగా అవగతమయ్యింది. 

జూలై 11వ తేదీ వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా యూసి బ్రౌజర్ భారతీయుల్లో జనాభా పెరుగుదలపై వున్న అవగాహనను తెలుసుకునేందుకు ఓ సర్వే చేపట్టింది. ఇందుకోసం ఒకే బిడ్డను కలిగివుండాలన్న చైనా ఫాలసీ ఇండియాలో  అమలు చేయాలని కోరుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ఈ సర్వేలో దాదాపు 45వేల మంది పాల్గొనగా అందులో 70 శాతం మంది భారత్ కూడా ఒకే బిడ్డను కలిగివుండాలన్న పాలసీని తీసుకురావాలని కోరారు. అయితే  మిగతా 30శాతం  మంది  వద్దంటూ తమ  అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. 

అయితే మిగతా విషయాల మాదిరిగా కాకుండా ఈ పాలసీపై కఠినంగా వ్యవహరించాలని కూడా చాలామంది సూచించారు. దీన్ని అతిక్రమించిన వారిపై ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటే భయంతోనైనా  దీన్ని ఫాలో అవుతారు. కాబట్టి '' ఒక జంట...ఒకే సంతానం'' అన్నది  కేవలం నినాదంగా కాకుండా ప్రజల జీవితాల్లో భాగమయ్యేలా చూడాలని చాలామంది తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 

భారత  దేశంలో జనాభా పెరుగుదల శాతం అధికంగా వుందని ఇప్పటికు వరల్డ్ హెల్త్ అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి. 2016 లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన  20 నగరాల్లో 14 మన దేశంలోనే వున్నాయంటే పరిస్థితి ఎంత  అధ్వాన్నంగా వుందో అర్థమవుతుంది. 

కాబట్టి దేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు ఈ అధిక జనాభాయే కారణమవుతోంది.  కాబట్టి భారత ప్రభుత్వం జనాభా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురాకుంటే దేశం ఈ  సమస్యల వలయంలోనే కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. కాబట్టి ముందే మేలుకొన్న భారత ప్రజలు ''ఒక జంట...ఒకే సంతానం'' అన్న పాలసీని అమలుచేయాలని డిమాండ్  చేస్తున్నారు.  
 
click me!