రూ. 10 వేలు ఇవ్వండి.. లైంగిక వేధింపుల కేసు సెటిల్ చేస్తాం.. అవినీతికి పాల్పడిన ఇద్దరు పోలీసులపై వేటు

Published : Dec 19, 2022, 03:28 PM IST
రూ. 10 వేలు ఇవ్వండి.. లైంగిక వేధింపుల కేసు సెటిల్ చేస్తాం.. అవినీతికి పాల్పడిన ఇద్దరు పోలీసులపై వేటు

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ లైంగిక వేధింపుల కేసును సెటిల్ చేయడానికి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. దీంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. శాఖాపరమైన చర్యలకూ ఆదేశాలు వచ్చాయి.  

లక్నో: అదొక లైంగిక వేధింపుల కేసు. ఈ కేసు ఆధారం చేసుకుని ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అవినీతికి పాల్పడదామని అనుకున్నారు. కానీ, అడ్డంగా బుక్కయ్యారు. దీంతో సస్పెన్షన్ వేటుకు గురవ్వడమే కాదు.. డిపార్ట్‌మెంటల్ దర్యాప్తునూ ఎదుర్కోవాల్సి వస్తున్నది. 

యూపీలోని బుదౌన్‌లోని ఉశాయత్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్స్ అభిషేక్ గోయల్, మనోజ్ కుమార్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు. వారి వద్దకు ఓ మోలెస్టేషన్ కేసు వచ్చింది. ఈ కేసు సెటిల్ చేయడానికి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. ఆ మొత్తం చెల్లిస్తేనే కేసు సెటిల్ చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ వారి పై యాక్షన్ తీసుకోవడానికి ఉపకరించింది.

ఆ ఆడియో క్లిప్ వైరల్ అయిందని ఎస్పీ (సిటీ) అమిత్ కిశోర్ శ్రీవాస్తవ తెలిపారు. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సోమవారం సస్పెండ్ చేసినట్టు వివరించారు. ఉజహాని సర్కిల్ ఆఫీసర్ ఈ ఆడియో క్లిప్ పై దర్యాప్తు చేస్తారని, ప్రాథమికంగా ఇది నిజమే అనే అభిప్రాయానికి వచచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరినీ సస్పెండ్ చేశారు. అంతేకాదు, వారిపై శాఖాపరమైన చర్యలకూ ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఐదు రాష్ట్రాల్లో ఎవరిది హవా? సౌత్‌లో విజయ్ ఎంట్రీతో మారిన లెక్కలు !
Modi Visits Kashi Vishwanath Temple:వారాణసి శ్రీకాశీవిశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు| Asianet News Telugu