
ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో మైనర్లు అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగు చూసింది. ఇద్దరు చిన్నారులను ముగ్గురు మైనర్లు పార్కుకు తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ ఘటనను నిందితులు తమ మొబైల్‌లో వీడియో కూడా తీశారు. 12, 10 ఏళ్ల బాధితుల ఫిర్యాదు మేరకు న్యూ అశోక్ నగర్ పోలీసులు దుర్వినియోగం, పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వయసు 12 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబాలు న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 12న బాలుడిని లైంగికంగా వేధిస్తున్నట్లు పిసిఆర్ కాల్ వచ్చింది. జూన్ 10వ తేదీ రాత్రి తన 12 ఏళ్ల కుమారుడు, తన పదేళ్ల స్నేహితుడితో కలిసి కుక్కలకు బిస్కెట్లు తినిపించడానికి పీర్ బాబా మజార్ వద్దకు వెళ్లాడని ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపారు. అక్కడ ముగ్గురు మైనర్లు వారిని బెదిరించి.. సమీపంలోని పార్కుకు తీసుకెళ్లారు ఓ బాలుడు పిల్లలిద్దరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, మరో ఇద్దరు మైనర్లు ఈ దుశ్చర్యను వీడియోలు తీశారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఎవరికైనా ఏదైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. భయాందోళనకు గురైన పిల్లలిద్దరూ తమ ఇంటికి చేరుకోగా.. అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు అడిగితే చెప్పలేదు. ఆరోగ్యం విషమించడంతో బాధితులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు.
పోలీసులు ముందుగా బాధిత చిన్నారులిద్దరికీ కౌన్సెలింగ్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 377, పోక్సో చట్టం 4 కింద కేసు నమోదు చేసి ముగ్గురు మైనర్ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.నిందితులను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. వారం రోజుల క్రితం ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఇటీవల (జూన్ 5న) న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో ఒక యువకుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు.