శివకాశీలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరి మృతి, నుజ్జునుజ్జయిన మృతదేహాలు

By Siva KodatiFirst Published Jul 25, 2023, 2:20 PM IST
Highlights

తమిళనాడులోని శివకాశి సమీపంలోని తాయిల్‌పట్టి గ్రామంలోని ఓ ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  మరణించిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా నుజ్జు నుజ్జు అయ్యాయి. 

తమిళనాడులోని శివకాశి సమీపంలోని తాయిల్‌పట్టి గ్రామంలోని ఓ ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని మంగుండంపట్టి గ్రామంలో ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన బాణాసంచా తయారీ ఫ్యాక్టరీ నడుస్తోంది. దీపావళి పండుగ సమీపిస్తుండటంతో ఇక్కడ 50 మందికి పైగా కార్మికులు పటాకుల తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కూలీలు బాణాసంచా తయారీకి కావాల్సిన రసాయనాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

ఈ క్రమంలో మెడిసిన్‌లో జరిగిన రాపిడి కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వెంటనే అక్కడ వున్న మందుగుండు సామాగ్రి పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలవ్వగా .. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా నుజ్జు నుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

click me!