శశికళతో ఫోన్ సంభాషణ.. అన్నాడీఎంకే నేత కారుమీద పెట్రోల్ పోసి, తగలబెట్టిన దుండగులు..

Published : Jun 22, 2021, 10:42 AM IST
శశికళతో ఫోన్ సంభాషణ.. అన్నాడీఎంకే నేత కారుమీద పెట్రోల్ పోసి, తగలబెట్టిన దుండగులు..

సారాంశం

శశికళతో ఫోన్ లో మాట్లాడారని అన్నాడీఎంకే నేత కారును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ సంఘటన రామనాథపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన శశికళ మళ్లీ ఉత్సాహం చూపుతున్నారు. 

శశికళతో ఫోన్ లో మాట్లాడారని అన్నాడీఎంకే నేత కారును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ సంఘటన రామనాథపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన శశికళ మళ్లీ ఉత్సాహం చూపుతున్నారు. అన్నాడీఎంకే నేతలతో టచ్ లో ఉంటున్నారు. అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 

రామనాథపురం జిల్లా అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శిగా కొన్నాళ్లు పనిచేసిన విన్నెంట్ రాజాతో శశికళ ఇటీవల మాట్లాడారు. ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో అన్నాడీఎంకే అధిష్టానం విన్సెంట్ రాజాను పార్టీ నుంచి బహిష్కరించి ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింద. కాగా విన్సెంట్ రాజాకు పరమకుడి సమీపంలోని మేలక్కావనూరు గ్రామంలో కాంక్రీట్ మిక్సింగ్ కంపెనీ ఉంది. 

ఇక్కడి సెక్యూరిటీ గార్డు ఆదివారం విధులకు రాలేదు. కంపెనీ ప్రాంగణంలో కారును పార్క్ చేసి అక్కడి గదిలో విన్సెంట్ రాజా నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో పెద్దగా శబ్దం రావడంతో బైటికి వచ్చి చూశాడు. 

గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కారు మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. విన్సెంట్ ను చూడగానే పారిపోయారు. విన్సెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word