ఒకే బిల్డింగులో 24 గంటల్లో ఇద్దరి ఆత్మహత్య.. అసలేం జరిగింది...?

Published : Mar 16, 2023, 07:54 AM IST
ఒకే బిల్డింగులో 24 గంటల్లో ఇద్దరి ఆత్మహత్య.. అసలేం జరిగింది...?

సారాంశం

కూతురు తల్లి కాలేదనే మనస్తాపంతో ఓ మహిళ మంగళవారం తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి అరిచాడని ఓ కొడుకు బిల్డింగ్ మీదినుంచి దూకేశాడు.

ముంబై : మహారాష్ట్రలోకి ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఒకే బిల్డింగ్ లోని వేరు వేరు ఫ్లాట్స్ లో ఉంటున్న ఇద్దరు.. 24గంటల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు 56 ఏళ్ల మహిళ కాగా, మరొకరు 18 ఏళ్ల బాలుడు. వీరిద్దరి మరణాలతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. తన కూతురికి సంతానం కలగడం లేదన్న మనోవేదనతో ఆ మహిళ ఉరేసుకుని చనిపోగా, తండ్రి కోపడ్డాడని కొడుకు ఆత్మహత్య చేసకున్నాడు. 

వివరాల్లోకి వెడితే.. ముంబయిలోని కాండివలి సబర్బన్‌లోని ఒక భవనంలో బుధవారం ఈ ఘటనలు వెలుగు చూశాయి. 56 ఏళ్ల మహిళతో మరో బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలు 24గంటల వ్యవధిలో వేర్వేరుగా చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు.

తన కూతురు తల్లి కాలేదనే మనస్తాపంతో మహిళ మంగళవారం తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఓ అధికారి తెలిపారు. మరో ఘటనలో బుధవారం ఉదయం 18 ఏళ్ల బాలుడు.. తండ్రి చదువుకోలేదని అరవడంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని బిల్డింగ్ వాచ్‌మెన్ గుర్తించి, సొసైటీ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో వారు వెంటనే పోలీసులను సమాచారం ఇచ్చారు.

ఈ మృతిని పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసులు నమోదు చేశారని, ఈ కేసుల్లో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఒక అధికారి తెలిపారు.

'శరవేగం రామమందిర నిర్మాణ పనులు.. ప్రధాని మోదీ చేత రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ..': అయోధ్య ఆలయ ట్రస్ట్

ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. గీజర్ నుంచి గ్యాస్ లీకవడంతో ఓ దంపతులు మృతి చెందారు. వారి ఐదేళ్ల బాబు స్పృహతప్పి పడిపోగా, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రాజస్తాన్ లోని భిల్వారా జిల్లాలో జరిగింది. ఈ దంపతులు తమ ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

బాత్రూంలో వారితోపాటు ఉన్న వారి ఐదేళ్ల కుమారుడు స్పృహతప్పి పడిపోయాడని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వారు తెలిపారు. మృతులను శివనారాయణ ఝన్వర్ (37), అతని భార్య కవితా ఝన్వర్ (35) గా గుర్తించారు. కుమారుడు విహాన్. వీరంతా షాపురా నివాసితులు.. వీరు షీత్లా అష్టమి రోజున రంగులతో ఆడుకున్నారని విచారణ అధికారి జితేంద్ర సింగ్ తెలిపారు.

ఆ తరువాత స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లారు. కానీ, రెండు గంటలు గడిచిపోతున్నా ముగ్గురూ బాత్‌రూమ్‌ నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో.. తలుపు తట్టారు. అయినా ఎలాంటి స్పందన లేదు. దీంతోవారు తలుపు పగులగొట్టి చూశారు. అక్కడ బాత్రూం గీజర్ ఆన్‌లో ఉంది. ముగ్గురు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే దంపతులు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని అధికారి తెలిపారు. చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?