మదురై చితిరై ఉత్సవాల్లో తొక్కిసలాట.. ఇద్దరు మృతి, పలువురి పరిస్తితి విషమం..

Published : Apr 16, 2022, 11:47 AM IST
మదురై చితిరై ఉత్సవాల్లో తొక్కిసలాట.. ఇద్దరు మృతి, పలువురి పరిస్తితి విషమం..

సారాంశం

మదురై చితిరై ఉత్సవాల్లో విషాద ఘటన జరిగింది. వైగై నదిలోకి కల్లజగర్ భగవానుడు ప్రవేశించే వేడుకలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మృతి మృతి చెందారు. 

మధురై : మదురైలోని వైగై నదిలోకి కల్లజగర్ భగవానుడు ప్రవేశించే కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఈ ఉత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. పలువురు పరిస్థితి విషమంగా ఉంది. 

కాగా, కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుక జరగలేదు. రెడేళ్ల తరువాత ఈ యేడు ఉత్సవాలు జరుగుతున్నాయి. మృతుల్లో ఒకరు మహిళ, ఒక పురుషుడు ఉన్నారు. చనిపోయిన మధ్య వయస్కుడైన వ్యక్తి, మహిళ ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉంది. మృతులకు సంబంధించిన సమాచారం తెలిస్తే తెలియజేయాలంటూ జిల్లా యంత్రాంగం 9498042434 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఇచ్చింది. 

ఇక ఈ ఉత్సవంలో గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. మదురైలోని చితిరై ఉత్సవాల 12వ రోజున, వైగై నదిలోకి కల్లజగర్ భగవానుడు ప్రవేశించే కార్యక్రమాన్ని చూసేందుకు తెల్లవారుజామున 4 గంటల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. సముద్రం మధ్యలో, పట్టు వస్త్రాలు ధరించి, భక్తజనసందోహం మధ్య స్వామివారు తన బంగారు గుర్రంపై శనివారం ఉదయం 5.50 నుండి 6.20 గంటల మధ్య వైగై నదిలోకి ప్రవేశించారు.

PREV
click me!

Recommended Stories

ఈసారి చ‌లికాలం కూడా చ‌మ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం.. వాతావ‌ర‌ణంలో పెను సంచ‌ల‌నాలు
RBI: దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారనున్న ఆ 5 గండాలు.. రిజర్వ్ బ్యాంక్ బిగ్ అలర్ట్