Latha Mangeshkar: రెండు రోజులు సంతాప దినాలుగా ప్రభుత్వ నిర్ణయం

Published : Feb 06, 2022, 02:18 PM IST
Latha Mangeshkar: రెండు రోజులు సంతాప దినాలుగా ప్రభుత్వ నిర్ణయం

సారాంశం

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణంతో సంగీత ప్రపంచం విషాదంలో కూరుకుపోయింది. ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ముంబయిలో ఆమె భౌతిక దేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆమె మరణానికి దేశవ్యాప్తంగా రెండు రోజుల సంతాప దినాలను పాటించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల్లో జాతీయ పతాకాన్ని సగం మేరకు ఎగరేయనున్నారు.  

న్యూఢిల్లీ: ప్రముఖ గాయని, గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) మరణంతో సంగీత ప్రపంచం(Music world)లో శోకసంద్రంలో మునిగింది. ప్రధాని మోడీ(Prime Minister Narendra Modi) సహా రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతాపం(Mourn) ప్రకటించారు. అదే విధంగా ఆమె మరణానికి దేశవ్యాప్తంగా రెండు రోజులు సంతాపం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీ, 7వ తేదీలలో లతా మంగేష్కర్ స్మృతిలో రెండు రోజులు దేశవ్యాప్తంగా సంతాపాన్ని పాటించాలని నిర్ణయం తీసుకుంది. ఆమెకు గౌరవంగా ఈ రెండు రోజుల్లో జాతీయ పతాకాన్ని సగం మేరకే ఎగరేయనున్నారు. మహారాష్ట్రలో అధికారికంగా లతా మంగేష్కర్‌కు అంతిమ క్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్య క్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుకాబోతున్నట్టు సమాచారం. అయితే, ప్రధాన మంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

లతా మంగేష్కర్‌ కరోనా బారిన పడ్డారు. అనంతరం ఆమె ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో ఈ నెల 8వ తేదీన చేర్చారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే ఉన్నారు. ఆమె ఆరోగ్యం కొంత మెరుగైంది. కానీ, మళ్లీ క్రమంగా ఆమె ఆరోగ్య దిగజారింది. ఈ రోజు ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ భౌతిక దేహాన్ని పెద్దార్ రోడ్డులోని ఆమె నివాసం ప్రభుకుంజ్‌కు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆమె భౌతిక దేహాన్ని నివాళుల కోసం అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత ముంబయిలోని శివాజీ పార్క్‌కు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో తరలించనున్నారు. శివాజీ పార్క్‌లోనే ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయ, శ్రద్ధగల లతా దీదీ మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమెతో నా పరస్పర చర్యలు మరువలేనివి. లతా దీదీ మరణించినందుకు నా తోటి భారతీయులతో నేను బాధపడ్డాను. ఆమె దేశంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చింది. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి ధీటుగా గుర్తుంచుకుంటాయి’ అంటూ మోడీ ట్వీట్ చేశారు.

తండ్రి మరణంతో 13 ఏళ్లకే సింగర్ గా మారిన లతా మంగేష్కర్... తన మొదటి సాంగ్ మరాఠి చిత్రం కోసం 1942లో పాడారు. అయితే ఈ సాంగ్ ఆ మూవీ ఆల్బంలో పొందుపరచలేదు. అలా మొదలైన ఆమె పాటల ప్రస్థానం దశాబ్దాల పాటు సాగింది. భాషాబేధం లేకుండా వేల కొలది పాటలు పలు చిత్ర పరిశ్రమలకు పాడారు. కెరీర్ లో లతా మంగేష్కర్ పాడినన్ని పాటలు మరో సింగర్ పాడలేదు. ఇది ప్రపంచ రికార్డు కూడాను. ఐదారు  తరాల బాలీవుడ్ స్టార్స్ సినిమాలకు లతా మంగేష్కర్ పాడారు. 

లతాజీ మరణవార్త  తెలిసిన చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లతాజీ మరణంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాటలను, ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిది అంటూ ఆవేదన చెందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !