
Punjab congress: ‘భారత రత్న’ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సానుభూతి తెలిపింది. లతా మగేష్కర్ మృతి నేపథ్యంలో.. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ఆదివారం ప్రకటించనున్నది. కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థిని మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా ప్రకటించనుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీయే లూథియానాలో నిర్వహించే ర్యాలీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఈ నేపథ్యంలో ఎలాంటి వేడుకల్లో పాల్గొనవద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరినట్లు సమాచారం. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్‌లో తమ సంతాపాన్ని తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన టిట్టర్ లో.. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ లతా మంగేష్కర్ కలిసి ఉన్న ఫొటోను పెట్టారు. లతా మంగేష్కర్ మరణం భారతీయ కళా ప్రపంచానికి తీరని నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుఃఖ సమయంలో బాధను తట్టుకోవడానికి ఆ భగవంతుడు భరించే ధైర్యాన్ని, ఆత్మస్థయిర్యాన్ని ప్రసాదించాలి. అని కోరుకున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ మరణవార్త చాలా విచారకరం.. ఆమె అనేక దశాబ్దాలపాటు భారతదేశానికి అత్యంత ప్రియమైన గళంగా కొనసాగారన్నారు. ఆమె బంగారు గళం శాశ్వతమైనది. ఆ గళం ఆమె అభిమానుల హృదయాల్లో నిరంతరం మారుమోగుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని నేడు ప్రకటించనుంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పగటిపూట వర్చువల్ ర్యాలీలో ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికల కోసం పార్టీ ముఖ్యమంత్రి ఎంపికను ప్రకటించనున్నారు.