టీకా తీసుకోవడానికి సిద్ధమేనా..? ప్రజలేమంటున్నారు? సర్వే ఏం చెబుతోంది..??

By AN TeluguFirst Published Jan 6, 2021, 2:29 PM IST
Highlights

అనేక దేశాలు టీకా పంపిణీకి సిద్ధమవుతున్న తరుణంలో లోకల్ సర్కిల్స్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఓ సర్వే నిర్వహించింది. టీకా వేసుకోవడం విషయంలో వారి స్పందన ఏమిటి?  కరోనా టీకా వేయించుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారా..? అసలు ప్రజల మనసుల్లో ఏముంది..? అనే విషయాలపై ఇది దృష్టి సారించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 

సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 69 శాతం మంది కరోనా టీకాను వేయించుకోవడంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వీర మరి కొంత కాలం వేచి చూసేందుకు నిర్ణయించుకున్నారని తేలింది. 

ఆక్స్‌ఫర్డ్, భారత్ బయోటెక్ టీకాలకు కేంద్రం అత్యవసర అనుమతలు జారీ చేసినా కూడా వారిలో ఇంకా అనేక సందేహాలు ఉన్నట్టు వెల్లడైంది. టీకాల భద్రత, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడమే ఈ సందిగ్ధానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. 

వ్యాక్సిన్‌పై మీ వైఖరి ఏంటి అన్న ప్రశ్నకు ఏకంగా 8 వేల పైచిలుకు సమాధానాలు రాగా అందులో దాదాపు 69 శాతం మంది తాము ఎటూ తేల్చుకోలేకపోతున్నామని అన్నారట. గత అక్టోబర్‌లో జరిగిన సర్వేలో 61 శాతం మంది తమకు టీకా విషయంలో అనేక సందేశహాలు ఉన్నట్టు తెలిపారు. 

ఫైజర్, మోడర్నా టీకాలు అందుబాటులోకి వచ్చాక జరిపిన సర్వేలో ఈ సంఖ్య 59కి పడిపోయింది. తాజాగా..ఇది 69 శాతానికి చేరుకుంది. మరోవైపు.. తమ పిల్లలకు తక్షణం టీకా వేయించేందుకు కేవలం 26 శాతం మందే సుముఖత వ్యక్తం చేశారని తేలింది. 

మరో 12 శాతం మంది దీనికి నో చెప్పగా  56 శాతం మంది మాత్రం మరో మూడు నెలల పాటు వేచి చూశాక అప్పటి సమాచారాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

click me!